సుంకులమ్మ దేవతకు బోనాలు సమర్పించిన మహిళలు

Aug 20, 2024 - 21:09
Aug 20, 2024 - 21:17
 0  95
సుంకులమ్మ దేవతకు బోనాలు సమర్పించిన మహిళలు

20-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బేక్కే0 గూడెం గ్రామాలలో సుంకులమ్మకు ఘనంగా బోనాలు సమర్పించిన  గ్రామాలమహిళలు. ఈరోజు గ్రామాల్లో కెళ్ళి ఆడపడుచులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి సుంకులమ్మ  దేవతకు బోనాలు సమర్పించారు.

 ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గ్రామస్తుల సహకారంతో, యువకుల పట్టుదలతో చిరుజల్లులు కురుస్తున్నప్పటికిని చిరుజల్లులను లెక్కచేయక భక్తిశ్రద్ధలతో ఎంతో ఆనందంతో  సుంకులమ్మ దేవతకు బోనాలు సమర్పించి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెద్దలు యువకులు అందరి ని చల్లగా చూడాలని ప్రార్థించారు.ఈ యొక్క కార్యక్రమంలో  గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State