గద్వాలలో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు 

Jan 9, 2026 - 18:52
 0  16

88వ విశ్వశాంతి మహా యజ్ఞాన్నికి తన వంతు సహాయంగా స్వామి శ్రీ కృష్ణ  జ్యోతి స్వరూపానంద స్వామి వారికి 1,00,000/-  లక్ష రూపాయలను అందించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ .

 జోగులాంబ గద్వాల 9 జనవరి 2026తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల లో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో  భాగంగా... బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణ * గురువారం రోజు విశ్వశాంతి మహా యజ్ఞానికి తన వంతుగా ఆర్థిక సహాయం స్వామి *శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపనంద  1,00,000 లక్ష రూపాయలను ధర్మ కార్యానికి అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణమ్మ  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కు భగవంతుడి ఆశీస్సులు కలగాలని భగవంతుని స్వామివారు ప్రార్థించారు.

జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల్ పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణాజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు జరిగే 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవములో శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ  పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు మంత్రాల మధ్య మహా హోమం నిర్వహించారు.

పాడిపంటలు సంవృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ డీకే అరుణ  భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333