బదిలీ పై వెళుతున్న జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి ని ఘనంగా సన్మానించిన
కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది.
బదిలీలలో భాగంగా వరంగల్ కమిషనరేట్ కు బదిలీ పై వెళుతున్న జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి గారిని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ ఆదేశాల మేరకు కార్యాలయ ఏ.ఓ సతీష్ కుమార్ మరియు సిబ్బంది శాలువా, పూలమాల తో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కార్యాలయ ఏ.ఓ మాట్లాడుతూ.... గత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని, అలాగే కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు విదుల పట్ల బాధ్యతలను గుర్తు చేస్తూ ముందుకు నడిపించారనీ అన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ
జిల్లా లో 7 నెలల పాటు తాము నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని, క్రింది స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిది అని, ముఖ్యంగా శాసన సభ ఎన్నికలను ఏలాంటి చిన్న ఇన్సిడెంట్ జరుగకుండా జిల్లా ఎస్పీ మేడమ్ అధ్వర్యంలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందామని అన్నారు. పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయుధ దళ డి. ఎస్పీ నరేందర్ రావు, సూపరిండెంట్స్ నాగేందర్, నయీం , ఎస్పీ సీసీ లోహిత్, కార్యాలయ సిబ్బంది రవి శంకర్, హనీఫ్, రామి రెడ్డి, అబ్సలం, హన్మంతు, రెహానా, తదితరాలు పాల్గోన్నారు.