టీ బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 17 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల పట్టణం దేవేందర్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం నందు పిపి యూనిట్ డి ఎం హెచ్ ఓ డాక్టర్. సంధ్య కిరణ్ మై ఆదేశాల మేరకు డాక్టర్.జి.రాజు ప్రోగ్రాం ఆఫీసర్ టీబీ ఆధ్వర్యంలో "టీబీ ముక్త్ భారత్ అభియాన్ "కార్యక్రమం, డాక్టర్ మాధుర్య మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఈరోజు శనివారం పీపీ యూనిట్ ఈ కార్యక్రమంలో భాగంగా టీబి హై రిస్క్ పాపులేషన్ ను స్క్రీనింగ్ నిర్వహించబడినది: 60 సంవత్సరాల పైబడిన వారు
అండర్ వెయిట్ వారు పొగ త్రాగువారు మరియు మద్యపానం సేవించువారు ఓల్డ్ టీబీ పేషెంట్స్ హై రిస్క్ ఏరియా లో ఉన్నవారికి, రక్తపోటు మరియు డయాబెటిక్ ఉన్నవారికి గుర్తించి వారికి : ఎక్సరే పరీక్షలు ,టీబి స్ఫూటుం, బిపి మరియు ఇతర రక్త పరీక్షలు నిర్వర్తించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డిస్టిక్ టీబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాదిక్, టి బి హెచ్ వి హెల్త్ సూపర్వైజర్ శేఖమ్మ, ఏఎన్ఎం సుజాత, స్వర్ణలత,టిబి అలర్ట్ ఇండియా టీం డిపిసి వెంకటేశ్ , ఎక్సరే కోఆర్డినేటర్ ఉదయ్, అంగన్వాడీ టీచర్లు రాధిక, నాగశేషమ్మ , ఆయా పావని, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.