ఘోర రోడ్డు ప్రమాదం ..అసిస్టెంట్ మేనేజర్ మృతి

Jan 5, 2026 - 12:23
 0  1956
ఘోర రోడ్డు ప్రమాదం ..అసిస్టెంట్ మేనేజర్ మృతి

తిరుమలగిరి 05 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలకెళితే తిరుమలగిరి యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సతీష్ (45) అనే వ్యక్తి తన స్వగ్రామం ఐనోవోలు నుండి వస్తుండగా మార్గమధ్యన తొండ గ్రామం సమీపాన రాగానే హెచ్ పి పెట్రోల్ ట్యాంకర్ లారీ (TG 03 T 3348) తిరుమలగిరి నుండి తొర్రూరు వెళుతుండగా ఎదురుగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి విచారణ చేసి మృతుని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు మృతునికి భార్య మరియు కుమారుడు కుమార్తె గలరు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి