బాధిత కుటుంబాలను ఆదుకుంటాం - జడ్పీ చైర్ పర్సన్ సరిత
ప్రభుత్వ తరపున అందుకోవటానికి కృషి చేస్తానని హామీ.
జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నియోజకవర్గంలో పలు మండలాలతో పాటు గద్వాల మండల పరిధిలోని లత్తిపురం గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం ఈదురుగాలులతో పాటు బారీ వర్షాలకు కురవడంతో చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగి గుడిసెలు కూలిపోయిన విషయం తెలుసుకున్న జెడ్పి చైర్ పర్సన్ సరిత బుధవారం లత్తిపురం గ్రామంను సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియజేశారు. గాలివాన లకు పూర్తిగా నష్టం వాటిల్లిన ముష్టి దుబ్బ రంగన్న మరియు వడ్డే తిమ్మన్న ల గుడిసెలకు జెడ్పి చైర్ పర్సన్ సరిత ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ...గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చెప్పటకపోవడం ద్వారా ప్రజలకు ఈ దృష్టితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీ లలో డబుల్ బెడ్ రూంలు ఇచ్చి ఉంటే ఇంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉండేది కాదని,కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపార్టీ ఈదురుగాలులకు నష్టపోయిన వారికి,ఇండ్లు లేని ప్రతి ఒకరికి లబ్ధిదారులను గుర్తించి పక్క ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా కృషి చేస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు..వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ బాబు, పూడూర్ ఈశ్వర్, జయన్న,లక్ష్మణ,జమ్మిచేడు ఆనంద్,కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి,కుర్మన్న, రాజశేఖర్ యాదవ్, సంజన్న,సమీ,రాజు తదితరులు ఉన్నారు