జోహార్ కామ్రేడ్ చెరబండ రాజు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్

Aug 18, 2025 - 21:34
Aug 19, 2025 - 12:00
 0  40
జోహార్ కామ్రేడ్ చెరబండ రాజు   కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్

తెలంగాణ వార్త రిపోర్టర్ జోహార్ కామ్రేడ్ చెరబండ రాజు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్... చెరబండరాజు కలం పేరుతో దిగంబరకవులలో ఒకరిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి" ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి కవి. చెరబండరాజు గారి అమరత్వ జ్ఞాపకం ! జోహార్లు....లాల్ సలాం !  చెరబండరాజు గారు మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలంలోని అంకుషాపూర్ లోని ఒక పేద రైతు కుటుంబంలో 1944లో పుట్టారు. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆరుగురు దిగంబరకవులలో ఒకరు. "నన్నెక్కనివ్వండి బోను" అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించి దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు గారు రాసిన "వందేమాతరం" గేయం పలువురి ప్రశంసలు పొందింది. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడుగా, కార్యదర్శిగా 1971-1972 లో పనిచేసారు. దిగంబరకవి నుండి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశారు . 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్టు అయ్యారు. • దిగంబర కవిత్వం-నేపథ్యం: 1965-68 మధ్య దిగంబర కవులు కవిత్వం విలువరించారు. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న అనే ఆరుగురు దిగంబర కవులుగా ఏర్పడి మూడు కవితా సంపుటాలను ప్రచురించారు. మూడు దశాబ్దాలుగా అభ్యుదయ కవిత్వోద్యమం కొనసాగి లేచిపడిన కెరటమైంది. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం, అమెరికాలో బీట్ జనరేషన్ అనే తిరుగుబాటు ధోరణి మొదలైంది. ఇంగ్లాండులో యాంగ్రీ యంగ్‌మెన్ ధోరణి ప్రబలింది. పశ్చిమ బెంగాల్‌లో కూడా 1960 ప్రాంతంలో యాంగ్రీ యంగ్‌మెన్ సాహిత్య ధోరణి తలెత్తింది. ఈ ధోరణుల ప్రభావం దిగంబర కవులపై ఉందని విమర్శకుల అభిప్రాయం. సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను చూసి కోపంతో తిట్లకు, పరుషపద ప్రయోగాలకు దిగారు. "పుళ్లు పడి కుళ్లిపోయిన వక్షం, పుచ్చిపోయిన పిండం, మెదడు పురుగు తినేసింది, చర్మం కుళ్లిపోయింది, అవయం పుచ్చిపోయింది, కళ్లకు కన్నం పడింది" వంటి పదజాలం వీరి కవిత్వంలో ఉంది. ప్రజల అంతరంగంలో వ్యాపించిన ఆరాటానికి, విసుగుకు విషాదానికి స్పందించారు. సమాజంలోని రాజకీయ కుళ్లును దిగంబరం చేసి చూపారు. సమాజంలోని అవినీతిని, దోపిడీని, ఆత్మవంచన, పరవంచనలను అసహ్యించుకున్నారు. మత మౌఢ్యాన్ని, గురువుల మోసాలను ప్రశ్నించారు. ఆధునిక నాగరికతలోని దుర్మార్గాలకు, అక్రమాలకు బాధపడ్డారు. సుమారు మూడేండ్లు తెలుగు సాహిత్యంలో గగ్గోలు పుట్టించిన వీరు 1970లో విరసం ఏర్పడినప్పుడు అందులో చేరారు. విరసంలో చేరినవారు నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు. .... ప్రపంచ పురోగతి అంతా శ్రమజీవి నెత్తుటిబొట్టులోనే ఇమిడి ఉందని నమ్మిన చెరబండరాజు ఆలోచన, అక్షరం, ఆచరణ ఏకరూపం దాల్చిన విప్లవ కవి. """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""" శ్రమజీవన సౌందర్యనీకి తిరుగుబాటును జోడిస్తే చరబండరాజు కవిత్వం ! '"""""""""""""""""”"'""""""""""""""""""""""""""""""""""""""""""”"'""""""""" రాజులను పొగిడి,దేవుళ్లను కీర్తించి భరణాలు పొందిన కవులున్నారు..ప్రభుత్వాలను మెప్పించి అవార్డులు గెలిచిన రచయితలున్నారు..కానీ జనం గుండెల్లోని బాధను అర్థం చేసుకుని అన్యాయంపై పోరాడి,ప్రజలకు ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించిన కవులు కొందరే..విప్లవకవి చెరబండరాజు వారిలో ఒకరు. చెరబండరాజు వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యక కధనం. గడ్డిపోచలు గర్జించే సమయం వచ్చినప్పుడు నిప్పురవ్వలు నిద్రపోవు… ఆకలినే పేరుగా మార్చుకుని శరీరాన్నే సాయుధం చేస్తాయి… .... ఆక్రమణే ఉనికిగా..ఉద్యమమే ఊపిరిగా విప్లవాన్ని పుట్టిస్తాయి… దోపిడిగాళ్ల చెర నుంచి కష్టజీవుల స్వర్గాన్ని విడిపించేందుకు అక్షరాలతో సమరశంఖం పూరిస్తాయి.. శ్రామికుడి కోపాన్ని, సామాన్యుడి సమరాన్ని గమ్యం వైపు నడిపిస్తాయి... ..... అలాంటి నిప్పురవ్వలలో ఒకడు చెరబండరాజు… చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి.. 1944 రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న రోజులవి.. ఫాసిజం పై సామ్యవాద, ప్రజాస్వామిక శక్తులు గెలుస్తున్న సమయమది… భారత్ నుంచి బ్రిటీష్ దొరలు వెళ్లిపోతారన్న నమ్మకం బలపడ్డ రోజులవి… దున్నేవారికే భూమి అంటూ వీర తెలంగాణ గర్జిస్తున్న విప్లవకాలమది…. సరిగ్గా అప్పుడే నల్లగొండ జిల్లా అంకుశాపురంలో తెలుగు సాహిత్యంలో ఉప్పెనను తీసుకొచ్చిన కెరటం పురుడు పోసుకుంది..ప్రసవవేదన భరించలేక చచ్చిపోతూ ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది..ఆ పసోడికి బద్దం బక్కారెడ్డి అని తండ్రి పేరు పెట్టాడు. కాని పిల్లాడికి జన్మనిస్తూ తల్లి పడిన బాధను తలుచుకుని శెరబందిరాజని పిలుచుకున్నాడు. అయితే స్కూల్ కు వెళ్లిన తరువాత బక్కారెడ్డి. భాస్కరరెడ్డి అయ్యాడు. బతుకులు బక్కవయినంత మాత్రానా పేర్లు బక్కగుండాలా అని ఒక ఉపాధ్యాయుడు భాస్కరరెడ్డి అని పేరు పట్టాడు. శరత్ చంద్ర నవలలను పరిచయం చేశాడు.రవీంద్రుని శాంతినికేతన్ స్వప్నాన్ని చూపించాడు.. ...... తెలంగాణలోని శ్రమజీవన సౌందర్యమే చెరబండరాజుకు కవిత్వాన్ని పరిచయం చేసింది.వ్యవసాయ కుటుబం కావడంతో పొలంలో కూలీలు,రైతులు పాడుతున్న పాటల ప్రభావంతో చెర కవిత్వం రాశాడు..అలా సాగుతున్న ఆ కవితాప్రవాహానికి పెళ్లి కొత్త సాహిత్యాన్ని అందించింది.పదహారేళ్ల వయసులోనే చెరబండరాజుకు పెళ్లయింది.భార్య శ్యామల తో కలిసి పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆమె నుదుటిపై చెమటతో అంటుకున్న కురులపైనా పద్యాలు రాశాడు. ప్రపంచం పద్మవ్యూహమయితే కవిత్వం తీరని దాహమన్నాడో కవి..ఆ దాహమే చెరను కొత్త తీరానికి చేర్చింది. పై చదువులు చదవించలేనని తండ్రి చెప్పడంతో. శాంతినికేతన్ కు పారిపోయాడు. కాని ఆ స్వప్నాన్ని చూడకుండానే తిరిగొచ్చి హైదరాబాద్ అంబర్ పేటలో టీచర్ ఉద్యోగంలో చేరాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెపుతున్నా. చదువు కోవాలన్న కోరిక తీరకపోవడంతో నల్లకుంట ఓరియంటల్ కాలేజీలో ఎం.ఒ.ఎల్ చేశాడు.. ..... 1965 తెలుగు సాహిత్య లోకం నిశ్శబ్దంగా ఉన్న రోజులవి. అలాంటి సమయంలో ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఐదు సంవత్సరాల పాటు తెలుగు సాహిత్యానికి దశా,దిశను చూపించింది. అదే దిగంబర కవిత్వం. ఆరుగురు దిగంబర కవుల్లో బద్దం భాస్కరరెడ్డి ఒకడు.దిగంబర కవిగా మారాక కులాన్ని సూచించే పేర్లువదులుకోవాలన్న ఉద్దేశంతో చెరబండరాజయ్యాడు. మిగిలిన ఐదుగురు కవులు బూతునే నమ్ముకుని కవిత్వం రాస్తుంటే చెరబండరాజు మాత్రం సామాన్యుడి భాషలోనే అక్షరాలతో అగ్గిపుట్టించాడు. సమాజంలోని దోపిడినీ, కుట్రలను ఎండగడుతూ పబ్లిక్ పల్స్ పట్టుకుని సందేశాన్ని సూటిగా చెప్పిన కవి చెరబండరాజు.... ఓ నా ప్రియమైన మాతృదేశమా… తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా… దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది… ఒంటిమీది గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది… అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది… సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రుస్తున్న యవ్వనం నీది… అప్పు తెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీదంటూ..... ..... 1970ల్లో చెరబండరాజు రాసిన ఈ కవిత ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందంటే అతని కలానికున్న పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఎగిసిపడ్డ కెరటంలా దిగంబరకవిత్వం హఠాత్తుగా 1970ల్లో ఆగిపోయింది. చెరబండరాజు విప్లవరచయితల సంఘంలో చేరాడు. తెలుగు పండిత శిక్షణ పొంది. ప్రాచీన సాహిత్యం చదువుకున్నా.. వచనకవిత్వంపై చెర పట్టుసాధించాడు.. సహజమైన భాషతో చెర సృష్టించిన వచన కవితా శైలి. తెలుగు సాహిత్యంలో భారీ మార్పులకు కారణమైంది.. అప్పటిదాక సంస్కృత పదాలతోనే కవిత్వం రాసిన శ్రీశ్రీ కూడా చెర ప్రభావంతో వచనాలతోనే రాశాడు.అయితే విప్లవభావజాలన్ని వచన కవిత రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లలేమని భావించిన చెర… తనను తాను మార్చుకుని పాట వైపు పయనించాడు… సహజమైన భాషలో గుండెలోతుల్లో నుంచి సూటిగా వచ్చే మాటనే జనం గొంతు వినిపించే పాటగా రాశాడు. చెర రచనాశైలితో ఎందరో జూనియర్,సీనియర్ కవులు ప్రభావితం అయ్యారు..దీంతో గద్దర్ లాంటి వాళ్లు కూడా విప్లవ సాహిత్యంలో పాటనే నమ్ముకోవాల్సి వచ్చింది. ..... తెలంగాణ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ 1969లో కవిత రాసినా…1972 నాటికి తన ఆలోచనలోని పొరపాటును దిద్దుకుని తెలంగాణ ఆకాంక్షను సమర్థిస్తూ కవితలు రాశాడు. దిగంబర కవిత్వం నుంచి విప్లవకవిత్వం వరకు సాగిన ప్రయాణంలో… సామాజిక వాస్తవాలను,విప్లవ చైతన్యాన్ని చాటుతూ ఎన్నో రచనలు చేశాడు. అణగారిన వర్గాలు, దళితులు,శ్రామికుల కోసం పోరాడాడు. చెర గొప్పతనం ఏంటంటే శ్రామికులు,ప్రజల గురించి రాయడమే కాదు,కార్మిక వర్గ జీవితాన్ని అనుభవించాడు. ఎమర్జెన్సీలో టీచర్ ఉద్యోగం పోయినప్పుడు బతుకుదెరువు కోసం ఆటో నడపి. కార్మిక వర్గ దృక్పథాన్ని ఆచరణలో చూపించాడు.. ..... 1971 నుండి 1977 మధ్యకాలములో మూడేళ్ల పాటు జైళ్లో గడపడం వలన ఈయన ఆరోగ్యము క్షీణించింది. జైళ్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్ గా పరిణమించింది. 1977 నుండి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈయన అనారోగ్యముతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవలసి వచ్చింది ..... ప్రజాసమస్యలపై అక్షరాలతో సమరం చేస్తోన్న చెరబండరాజును ప్రభుత్వాలు సతాయించాయి. పోలీసు కేసులతో హింసించి పరోక్షంగా చంపేశాయి. బ్రేయిన్ ట్యూమర్ తో 1982 జులై 2న చెరబండరాజు చనిపోయారు. ..... చెరబండరాజు గారు రాసిన పాటల్లో ముఖ్యమైనవి కొండలు పగలేసినం, బండలనే పిండినం, ఏ కులమబ్చీ మాదేమతబ్బీ, విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. ఈయన రచనలు 1) దిగంబర కవితా సంకలనాలు 2) దిక్సూచి 3) ముట్టడి 4) గమ్యం 5) కాంతియుద్ధం 6) గౌరమ్మ కలలు 7) జన్మహక్కు 8) పల్లవి 9) కత్తిపాట మొదలైన కవితా సంపుటాలు. నవలలు మా పల్లె, ప్రస్థానం, నిప్పులరాళ్లు, గంజీనీళ్లు. కవితా సంపుటికి ఫ్రీవర్సు ఫ్రంట్ అవార్డు లభించింది. ..... యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము నీ యవ్వన తేజంతో ప్రజాపోరు నడవాలి నీ రక్తం పుష్పించగ ఈ దేశం ఫలించాలి. - చెరబండరాజు, జూన్, 1978. అనారోగ్య బాధితుణ్నే అయితేనేం యోధుణ్నే పోరాటం డైరెక్షన్ పాట నాకు అక్సిజన్ అంటూ కలవరిస్తూ, పలవరిస్తూ కన్నుమూసిన చెరబండరాజు నిబద్దతకు మరోపేరు... నేటి విద్యార్థి యువజన ప్రజాతంత్ర వాదులు కామ్రేడ్ చెరబండరాజు గారి జీవితము నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని... సమసమాజ స్థాపనకు పోరాటం చేయాల్సిన కర్తవ్యం యువతరం మీద ఉందని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ యువతరానికి పిలుపునిచ్చారు