జూరాల ప్రాజెక్టునుండీ 10 గేట్లను ఎత్తి 1,30,000 క్యూసెక్కులు,తుంగభద్ర నది నుండీ 1,20,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తునందున కృష్ణ,తుంగభద్ర నదుల తీరా ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

___ జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్.
నదుల వరదల దృష్ట్యా పోలీస్ యంత్రాంగాన్నికి పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ .
జోగులాంబ గద్వాల 29 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల జూరాల ప్రాజెక్టునుండీ 10 గేట్లను ఎత్తి 1,30,000 క్యూసెక్కులు,తుంగభద్ర నది నుండీ 1,20,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తునందున నదుల తీరా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు భారీగా వరద ప్రవాహం వస్తునందున,జూరాల ప్రాజెక్టు నుండి 10 గేట్లను ఎత్తి 1,30,000 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నది నుండి 120000 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుందని , కావున నదుల తీరా గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపలు పట్టే వారు, పశువులు , గొర్రెల కాపరులు, రైతులు నదుల లోకి వెళ్లవద్దని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర నదుల నుండి వస్తున్న ఎక్కువ ప్రవాహం దృష్ట్యా సంబంధిత పోలీస్ అధికారులను నదుల తీరా గ్రామాలలో తగిన ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండటం తో పాటు తీరా గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.