మండల ఎంపీడీవో భాస్కర్ గారికి వినతి పత్రం అందించిన రాజోలి గ్రామస్తులు

జోగులాంబ గద్వాల 29 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : రాజోలి కేంద్రమైన గ్రామంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఎలాగా అయితే ఓటర్ జాబితా ఉందో అలాగనే స్థానిక ఎన్నికల్లో కూడా అదే జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే అలా కాని ఎడల 2009 నాడు పాత రాజోలి గ్రామంలో వరద వచ్చి ఇండ్లన్నీ కూలిపోవడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ కొత్త రాజోలి గ్రామాన్ని దాదాపు 70% వరకు ఇండ్ల నిర్మాణం పూర్తిగా చేపట్టడంతో నది ప్రహారిక ప్రాంతాలకు దగ్గర ఉన్న ఒకటి,రెండు మూడు,నాలుగు,ఐదు, వార్డ్కు సంబంధించిన ప్రజలు అత్యధికంగా అనగా 80 శాతం కుటుంబాలు కొత్త రాజోలి గ్రామంలో నివసిస్తున్నారు కాబట్టి కొత్త ఓటరు జాబితా తయారు చేయాలనుకుంటే ఇక్కడ నుండి మొదలు పెట్టడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అలాగే 2009న కొత్త రాజోలి గ్రామంలో పునర్వాస కేంద్రంలో పాత ఊర్లో గతంలో ఎలాగైతే గ్రామంలో వార్డుల ప్రకారం అందరికీ స్థలాలు ఇండ్లు కేటాయించడం జరిగింది దాని ప్రకారం అయినా ఓటర్ కొత్తగా జాబితా తయారుచేసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగానైనా ఆలోచన చేయగలరని గ్రామ,మండల అధికారులకు కోరుతూ గ్రామస్తులంతా కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ కృష్ణయ్య , మండల ఎంపీఓ ఖాజా సంజీవరెడ్డి ,నిషాక్ , శశి కుమార్ , తెలుగు రంగన్న, తెలుగు రాముడు,యువకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.