చర్ల మండలం బట్టి గూడెంలో ఉన్న ఫారెస్ట్ భూమిని తక్షణమే లింగాల కాలనీ ప్రజలకు పంచాలి న్యూడెమోక్రసీ డిమాండ్

Jun 21, 2024 - 21:05
 0  54
చర్ల మండలం బట్టి గూడెంలో ఉన్న ఫారెస్ట్ భూమిని తక్షణమే లింగాల కాలనీ ప్రజలకు పంచాలి న్యూడెమోక్రసీ డిమాండ్

*చర్ల మండలం బట్టి గూడెంలో ఉన్న ఫారెస్ట్ భూమిని తక్షణమే లింగాల కాలనీ ప్రజలకు పంచాలి న్యూడెమోక్రసీ డిమాండ్*

చర్ల తెలంగాణ వార్త ప్రతినిధి జూన్ 21:-

చర్ల మండలం కలివేరు గ్రామ ప్రజలు 1980 లో పోడుకొట్టుకొని సాగు చేసుకుంటుండగా అక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి భూమిని ఆక్రమించుకొని వారికి హాదినంలో ఉంచుకున్నారు అప్పట్లో ఆ ప్రజల మీద కూడా కేసులు నమోదు చేశారు తక్షణమే భట్టి గుడెం దగ్గర ఉన్న ఫారెస్ట్ భూమిని కలివేరు గ్రామ ప్రజలకు పoచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ *చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు*.

బట్టి గూడెం భూములపై భద్రాచలం ఐటిడిఏ ఏపీఓ కి నిన్న ధర్నా చేసి విన్నవించామని అయినా ఫలితం లేకపోవడంతో ఈరోజు భూమి దగ్గరికెళ్ళి సర్వే చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు వచ్చారు వారితో చెప్పాం ఈ భూమిని తక్షణమే గ్రామ సభ నిర్వహించి పిసా యాక్టివ్ ప్రకారం కలివేరు గ్రామ ప్రజలకు అట్టి భూమిని పంచాలని లేనిచో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన చేస్తామని చెప్పి కోరారు. అనంతరం శ్రీనివాస్ తహసిల్దారు గకి ఎస్ఐ నర్సిరెడ్డి గారికి బీట్ ఆఫీసర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

వారం రోజుల్లో ఈ భూములపై గ్రామసభ నిర్వహించకపోతే అట్టి భూముల్ని కలివేరు ప్రజలే దున్నుకొంటారని మా పార్టీ పరంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇర్ప సమ్మక్క బుర్ర సీతమ్మ ఇర్ప ముత్తమ్మ కల్లూరి ఆదిలక్ష్మి బుర్ర విజయ రావు ఇరుప ఆదినారాయణ ఒడియా మహేష్ సబ్కా నాగలక్ష్మి బుర్ర దుర్గ అలవాల విజయలక్ష్మి కల్లూరి భవాని పావని అలవాల సత్తెమ్మ కల్లూరు జయ అలవాలు సాంబయ్య ఇర్ఫా రవణ మడకం కనక ఇరుపబాయమ్మ శ్రీదేవి కమల తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్