కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన
ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ నియోజకవర్గంలో ఆలంపూర్ చౌరస్తా - ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అయిజ, మానవపాడు, ఇటిక్యాల, ఆలంపూర్ మండలాల చెందిన 376 మంది లబ్ధిదారులకు (మొత్తం ₹3.76 కోట్ల రూపాయలు) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఆలంపూర్ శాసనసభ్యులు శ్రీ విజయుడు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేదవారి కుమార్తెల వివాహాలకు గొప్ప ఆర్థిక భరోసా కల్పిస్తుందని. ప్రతి చెక్కు ₹1,00,116 విలువ కలిగి, మొత్తం ₹3.76 కోట్ల రూపాయల 376 మంది లబ్ధిదారులకు సహాయం అందించడం నాకు సంతోషకరమని, అల్లంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలంపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రశంసించారు.