అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి!బొడ్డు కిరణ్ బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Apr 2, 2025 - 13:35
Apr 2, 2025 - 13:37
 0  173
అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి!బొడ్డు కిరణ్ బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

శాలిగౌరారం 02 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊర్కొండలో వివాహితపై జరిగిన దారుణమైన అత్యాచారాన్ని బి.ఎస్.పితీవ్రంగా ఖండిస్తోందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా శాలిగౌరారం మండల పరిధిలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..అత్యాచారం పైన మరింత వేగవంతమైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని,దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కఠిన శిక్షలు విధించి,బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి,మరియు ఇలాంటి అమానవీయ,క్రూర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని బి.ఎస్.పి డిమాండు చేస్తుందని తెలిపారు.