జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి"మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి :మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి గారు.. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా మరియు రెండు నియోజకవర్గలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అధికారులకు చూసించారు గ్రామాలలో పట్టణాలలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు రైతు సోదరులు కూలీలు పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు స్తంభాలు వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు చిన్నపిల్లలను వృద్ధులను తడిచిన స్తంభాలు ప్రమాదకరంగా ఉన్న వేర్ల వద్దకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులను కోరారు శిధిలమైన పురాతనమైన భవనాలలో నివసించేవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే పద్మావతి గారు ప్రజలకు తెలిపారు????????