రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి

బి.ఆర్.ఎస్ నాయకులు అలుగునూరి ఈదయ్య
తెలంగాణ వార్త వేములపల్లి ఏప్రిల్ 3: ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లోరైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాడ్గులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకులు అలుగునూరి ఈదయ్య, అన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం 26 జనవరి న రైతు భరోసా నిధులు మొదలుపెట్టి మార్చి 31 వరకు రైతులందరి ఖాతాలోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పిమూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసి మిగతా రైతులను మోసం చేసింది అన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు ఇలా మాట తప్పితే సమాజంలో జరగబోయే స్థానిక ఎలక్షన్లో ఓటుఅనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్తారన్నారురోజుకో కొత్త డ్రామా లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పరిపాలన సంక్షేమ పథకాలను అమలు చేయలేక 100 శాతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైతున్నారని అన్నారు గత బిఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క రైతు కూడా ఎదురు చూడకుండా 12సార్లు రైతుబంధు పైసలు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వానాకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టి ఈ యాసంగి వేస్తాం అన్నది కూడా వేయకుండా రైతులను మోసం, మరో పక్క రైతులు సాగు చేసిన వరి పొలాలు సాగునీరు అందక ఎండిపోయిఅన్ని అధికమించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారుఇప్పటికైనా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతులందరికీ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.