ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు,ప్రజలకు పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
డోర్నకల్ 18 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మంగళవారం నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ 'ప్రజాపాలన విజయోత్సవ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా సభకు విచ్చేసి సభ విజయవంతం చేయాలి కోరారు.సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి అవుతుంది దశాబ్ది నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన రాష్ట్రం ప్రజలకిచ్చిన ఆరుగ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు ప్రజా శ్రేయస్సు,వికాసమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ అమలు ప్రజాపాలన విజయోత్సవ సభ వేదికగా ప్రజా సంక్షేమానికి పునరంకితమవున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7నాటికి ఏడాది పూర్తి కానున్న శుభసందర్భంలో నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తలపెట్టిన ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు,ప్రజలకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతున్నదని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,బడుగు,బలహీన వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,రూ. 500లకే గ్యాస్ సిలిండర్,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం సహాయం రూ. 5 లక్షల నుంచి10లక్షలకు పెంపు,రూ. 2 లక్షల రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారని డాక్టర్ రాంచందర్ నాయక్ స్పష్టం చేశారు.ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని వేల కోట్ల రూపాయల రుణాలను అందిస్తూ వారి స్వయం సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని అన్నారు.ఇందిరమ్మ పేరు వినపడని,కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పొందని గ్రామమే వుండదని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ తేల్చి చెప్పారు.ఇందిరమ్మ సంక్షేమ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెచ్చిందని డాక్టర్ రాంచందర్ నాయక్ తెలిపారు.సంక్షేమం,అభివృద్ధి జోడెద్దులుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరుగులు పెడుతున్నదని అన్నారు.ప్రజల శ్రేయస్సు,వికాసమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ,సోనియా గాంధీల నిర్దేశకత్వంలో ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సమర్థ కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ తెలిపారు.విజయోత్సవ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశానిస్తారని డాక్టర్ రాంచందర్ నాయక్ స్పష్టం చేశారు.