జాతీయ స్థాయిలో 383 ర్యాంకు సాధించిన ఎస్.రుబిక ను సన్మానించిన - సరితమ్మ
జోగులాంబ గద్వాల 15 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.
మల్దకల్. మండలం అమరవాయి గ్రామానికి చెందిన ఎస్.గోకారన్న ఎస్.సువార్తమ్మ దంపతుల కూతురు ఎస్.రూబిక జాతీయ అగ్రికల్చర్ ఐకార్ విభాగంలో 383 ర్యాంకు సాధించి,కేటగిరి విభాగంలో 48 ర్యాంకు సాధించిన విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విద్యార్థిని రూబిక శాలువా కప్పి పుష్పగుచ్చాంతో సన్మానించి అభినందించారు.. అనంతరం ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని,వారి పేదరికాన్ని గుర్తించి విద్యార్థిని రూబిక జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితం సాధించడం అభినందనీయమని అన్నారు,చదువు ద్వారానే పేదరికాన్ని రూపుమార్చుకోవడం జరుగుతుందని అన్నారు. సమాజంలో వ్యక్తులకు ఆస్తులు,ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా చదువుకోవడానికి జ్ఞానం లేకపోతే సున్నా అని అన్నారు.ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఎస్.రుబికను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగం సాధించి వారి జీవిత అభివృద్ధికి బాటలు వేసేందుకు కృషిచేయాలని అన్నారు.అప్పుడే జీవిత సంకల్పానికి నిదర్శనంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావాయి కృష్ణారెడ్డి, అల్వాల రాజశేఖరరెడ్డి,పెదొడ్డి రామకృష్ణ,సద్దనోంపల్లి గోపాల్, డి.ఆర్.శ్రీధర్, కుర్వ శ్రీనివాసులు,వెంకట్రాములు,ధోని ఆంజనేయులు,తిమ్మప్ప,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు..