గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ డాక్టర్" రామచంద్ర నాయక్

Apr 26, 2025 - 19:38
 0  9
గోర్ మాటీ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ డాక్టర్" రామచంద్ర నాయక్

మరిపెడ 26 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు ను విజయవంతం చేయండి.జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో భవసంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రంలో జరిగే  గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను ఐక్య వేదిక బృందం కలిసి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సమావేశానికి అందరూ హాజరు అయి విజయవంత చేయాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది.


    ఈ సందర్భముగా లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో జరిగే సప్త భవాని మాతలు 6 గురు జాతి గురువులు,బాలాజీ మహారాజ్,భవసంగ్ మహారాజ్, బుడియ బాపు,లింగ మసంద్, లోక మసంద్ ల భోగ్ భండార్ కార్య క్రమానికి జాతి గురువులు, సాధువులు,సంతువులు, బావాలు,భగత్ ల చేతుల మీదుగా మాత్రమే జరిగే భోగ్ కార్య క్రమానికి హాజరు అయ్యి శనివారం ఏప్రిల్ 26న జరిగే మాకుల భవసంగ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి వారి బండ్లు తిరిగే కార్య క్రమానికి అందరూ హాజరు అవ్వాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త అలాగే పూజారుల సంఘం నాయకులు బానోత్ సీతారాం నాయక్,జడ్పీటీసీ మరిపెడ కాంగ్రెస్ అభ్యర్థి రవి నాయక్ గూగులోత్ ,మరిపెడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి భట్టు నాయక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బోడ రవి నాయక్ జిల్లా విద్యార్థి విభాగం సమన్వయ కర్త బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333