జాగృతి జనం బాట, సూర్యాపేట.కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్
తెలంగాణ వార్త సూర్యపేట జాగృతి జనం బాట 4-1-26:- పాలమూరు-రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్దాలు చెప్పింది. ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్ర కు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కృష్ణా నది నీళ్ల అంశంపై చర్చించాలి.పాలమూరు-రంగారెడ్డి, నారాయణ్ పేట్ -కొడంగల్ కు 77.5 టీఎంసీ లు కేటాయిస్తే 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారు. పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరు.హరీష్ రావు ను తిడితే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోవటం బీఆర్ఎస్ డ్రామా
బీఆర్ఎస్ బాయ్ కాట్ హరీష్ రావు నిర్ణయమా? బీఆర్ఎస్ పెద్దల నిర్ణయమా?
కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లే.
అసెంబ్లీ మాట్లాడే అవకాశం వదిలి...బయట సభలు పెట్టి ప్రజలకు వివరిస్తారా?
తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒప్పందంపై హరీష్ రావు సంతకం చేశారా? లేదా?
జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి?
కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చితే నేనే రియాక్ట్ అయ్యా. బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందించలేదు.సూర్యాపేట్ లో జగదీష్ రెడ్డి అనుచరులు గుడులను, చెరువులను కూడా వదలలేదు.హరీష్ రావు, జగదీష్ రెడ్డి పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు.అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపై నేను మాట్లాడుతూనే ఉంటాను.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామెంట్స్
నిన్న అసెంబ్లీలో విచిత్ర పరిణామాలు జరిగాయి.
అసలు సెషన్ లో మొత్తం ప్రతిపక్షమే లేకుండా సభ జరిగింది.
దీంతో పాలకపక్షం అడ్డగోలుగా అబద్దాలు చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఇష్టానుసారం ప్రసంగం కొనసాగించారు.
నిజానికి కృష్ణా నది నీళ్ల మీద చర్చ అని చెప్పారు.
అలాంటప్పుడు స్టేక్ హోల్డర్స్ అయిన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ గురించి మాట్లాడాలి.
కానీ అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి వచ్చిన దాని మీద మాత్రమే చర్చ చేశారు. దాంతో ప్రజలకు ఏం లాభం?
కృష్ణా వాటర్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులోనే రెండు రాష్ట్రాలను మాత్రమే ఉంచి మనకు అన్యాయం చేశారు.
సభలో మాత్రం సీఎం నేను మాట్లాడేది వందేళ్లు చరిత్రలో ఉంటుందన్నారు. అసలు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టిని 5 మీటర్లు పెంచుతుంటే దాని మీద కదా మాట్లాడాలి.
కర్ణాటక చర్య కారణంగా వంద టీఎంసీ ల నీళ్లను మనం నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ఏమాత్రం చర్చ జరపకుండా ఒక లెటర్ రాసి సైలెంట్ గా ఉన్నారు. అసలు ఆల్మట్టి ఎత్తు పెంపు పై ఎందుకు మాట్లాడలేదు. కృష్ణా నది నీళ్లపై ఎందుకు చర్చించలేదు? బీఆర్ఎస్ ను తిట్టి పొలిటికల్ గా ప్రయోజనం పొందేందుకు చర్చ జరిగినట్లు ఉంది.నిజంగా పాలమూరు జిల్లాపై ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా?
జాతీయ హోదానే ఇవ్వమని చెప్పిన కేంద్రం...కర్ణాటక ఎన్నికల కోసం అప్పర్ భద్రకు ఆ హోదా ఇచ్చింది.
దీని కారణంగా తుంగభద్రకు రావాల్సిన నీళ్లను వాళ్లు ఆపుకున్నారు.
అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడటం లేదు?
భవిష్యత్ లో మహారాష్ట్రతో ఇబ్బంది వస్తే ఎలా అన్న దానిపై కూడా చర్చించాలి కదా?
తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కురచ మనసుతో మాట్లాడారు.
రేవంత్, ఉత్తమ్ లకు చిత్తశుద్ధి ఉంటే అప్పర్ భద్ర జాతీయ హోదా, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి.
ఆల్మట్టి ఎత్తు తగ్గించేలా రేవంత్ రెడ్డి కృషి చేయాలి. లేదంటే ఆయనను పాలమూరు ప్రజలు క్షమించరు. నారాయణ పేట్- కొండగల్- మక్తాల్ ఇన్ టేక్ పాయింట్ ను జూరాల నుంచి మార్చుకోవాలి. పాలమూరు ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశాన్ని వదులుకోని చరిత్ర హీనులు కావద్దు.
సభలో కాంగ్రెస్ ది ఒక డ్రామా అయితే బీఆర్ఎస్ ది మరొక డ్రామా. సభలో మూసీ, జీహెచ్ఎంసీ కి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగితే ప్రతిపక్షం లేదు.
నేను గుంటనక్క అనే వ్యక్తిని అందరూ హరీష్ రావు అంటారు. ఆయనను ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. కేవలం హరీష్ రావు ను అంటే బాయ్ కాట్ చేస్తారా? కేసీఆర్ ను తిట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహరించిందా?
ప్రతిపక్షం అంటే ఒక పార్టీ మాత్రమే కాదు ప్రజల గొంతుక.
ఏదైనా అంశంపై వ్యతిరేకత ఉంటే ఆ అంశంపై మాత్రమే బాయ్ కాట్ చేయాలి. మేము పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా అంశాలను బట్టి వ్యతిరేకత చెప్పే వాళ్లం.
మళ్లీ వేరే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్లం. నిన్న జీహెచ్ఎంసీ ని 300 డివిజన్ చేసే బిల్లు పెట్టారు. అది అవసరం లేదా? హరీష్ రావు ను తిట్టారు కనుక వాయిదా వేసుకొని పోయారా? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాయ్ కాట్ నిర్ణయాన్ని హరీష్ రావు తీసుకున్నారా? లేక బీఆర్ఎస్ అధినాయకత్వం తీసుకుందా? బీఆర్ఎస్ మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా, శ్రీనివాస్ యాదవ్ గార్లు కూడా తమ టైమ్ హరీష్ రావు గారికే ఇవ్వమన్నారు.
అంటే హరీష్ రావు గారు పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారుచేసుకుంటున్నారు. బాయ్ కాట్ నిర్ణయం కచ్చితంగా హరీష్ రావు దే అని నేను బలంగా నమ్ముతున్నా.
ఒక వేళ కేసీఆర్ గారు గానీ కేటీఆర్ గారు గానీ తీసుకొని ఉంటే అది శ్రేయస్కరమైన పద్దతి కాదు.
కృష్ణా నది నీళ్లపై సభలు పెడతామంటున్నారు. చట్ట సభలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం సరికాదు.
ప్రజలు ఏమనుకున్న సరే బీఆర్ఎస్ లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షం లేకపోవటంతో కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్పారు.
బీఆర్ఎస్ ఉండి ఉంటే ఆ అబద్దాలను అడ్డుకునే అవకాశం ఉండేది కదా?
హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట? అంతకుముందు ఆయనను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా?
తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరు కాదా?
ఇప్పటికే కట్టిన ప్రాజెక్ట్ లపై తెలంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేది.
కానీ కాళేశ్వర రావు అని పిలిపించుకున్న హరీష్ రావు గారు మనకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇది నిజమా? కాదా? చెప్పాలి. విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ప్రజలు గమనిస్తారు.
నేను అడిగిన ప్రశ్నలకు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సమాధానం చెప్పాలి.
జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా చెప్పాలి.
అప్పుడు కేసీఆర్ గారు చాలా చెప్పారు. కానీ అవి కాలేదు.
హరీష్ రావు ధనదాహాం కారణంగానే ఇన్ టేక్ పాయింట్ శ్రీశైలం కు మారింది.
ఏల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారు. అందుకు దాదాపు 14 వందల కోట్లు ఖర్చు పెట్టారు.
దీని కారణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవాల్సిన వాటర్ కెపాసిటీ తగ్గింది.
పైగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కారణంగా కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ లో మోటార్లు చెడిపోయాయి.
మొత్తం 5 మోటార్లకు గాను ఇప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ కూడా చేయలేదు.
కచ్చితంగా నేను అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి.
అసెంబ్లీలో చెప్పే అంశాలను పార్టీ ఆఫీస్ లో చెప్పటం సరికాదు.
హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటేనే ఆయనకు రేవంత్ తో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉంటాయి.
కేసీఆర్ గారిని కసబ్ తో పోల్చితే నేను మాత్రమే రియాక్ట్ అయ్యాను.
కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ లేదు. అలాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ తో పోల్చుతారా?
రాజకీయంగా హుందాగా విమర్శలు చేయాలని భావించే వ్యక్తిని నేను.
కేసీఆర్ గారిని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
మరి కృష్ణానది లో నష్టం చేస్తున్న దానికి ఆయనను రెండుసార్లు ఉరి తీయాలి.
కేసీఆర్ గారిని అలా విమర్శించటం దేశద్రోహామే అవుతుంది.
కేసీఆర్ గారిని అలా విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడలేదు.
వాళ్ల ఎజెండాలు వాళ్లకు ఉన్నాయి. అందుకే వాళ్లు లోపల, నేను బయట ఉన్నాను.
ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు- రంగారెడ్డి కి 70 టీఎంసీలు, కొడంగల్- నారాయణ్ పేట్ కు 7.50 టీఎంసీలు కేటాయించారు.
కానీ 45 టీఎంసీలకు పరిమితమవటానికి ఎందుకు సంతకం చేశారు.
బీజేపీ కి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. పోరాటం చేయాల్సిన వాళ్లు పట్టించుకోవటం లేదు.
బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ బీజేపీ అలాగే చేసింది.
సమస్య తీర్చే స్థాయిలో ఉండి మనతో పాటు ధర్నా చేయటం ఏంటీ?
బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వాలి. మనలాంటి వాళ్లు అడగాలి?
బీఆర్ఎస్ హయాంలో నన్ను నిజామాబాద్ కే పరిమితం చేశారు.
అయినా సరే ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో నాకు కూడా భాగం ఉన్నట్లే.
నేను జనం బాట ప్రారంభించినప్పుడే క్షమాపణ చెప్పి ముందుకు కదిలాను.
నాయకులు తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరి సరిదిద్దుకోవాలి.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేశారు. ఉద్యమకారులకు చేయాల్సినంతా చేయలేదు.
ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉన్నట్లే. అందుకే క్షమాపణ చెప్పాను.
భవిష్యత్ లో చాలా జరుగుతాయి. ఇక నేను సక్సెస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? ప్రజలు నిర్ణయిస్తారు.
సూర్యాపేట జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం.
జాగృతి తొలిదశలో ముఖ్యమైన చాలా కార్యక్రమాలు ఇక్కడ చేశాం.
ఫణిగిరి మ్యూజియంలో కళాఖండాలు ఇప్పటికీ మా జాగృతి ఆఫీస్ లో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోనే జూరాస్ పల్లి గుట్ట మీద దేవస్థానం కోసం కొట్లాడినం.
గొల్లగట్టు జాతర ఘనంగా జరిపించాలని కూడా మేము ఫైట్ చేశాం.
బీఎన్ రెడ్డి, ముల్లు స్వరాజం, మాలోజు వీరన్న లాంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకు సలాం.
బీఎన్ రెడ్డి గారి పేరును ఏదైనా ప్రాజెక్ట్ కు పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ముల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఖర్చుతో సుర్యాపేట్ లో ఏర్పాటు చేయాలి.
ఉప్పల మధుసూదన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఎంతో నిజాయితీ పరులు.
ఎమ్మెల్యే అయిన కూడా ఆయన చెప్పులు కుట్టారు. ఏదైనా మంచి కార్యక్రమానికి ఆయన పేరు పెట్టాలి.
బండి యాదగిరి గారు రాసిన పాట స్ఫూర్తితో నిజాం పైన పోరాటం చేశాం.
అదే స్ఫూర్తితో నేను కూడా గుంట నక్క మీద యుద్ధం చేస్తున్నా.
సామాజిక తెలంగాణ ను ప్రతిపాదించిన వ్యక్తి మారోజు వీరన్న.
ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఉద్యమం చేస్తున్నాం.
ఇక కేంద్రంలో ఉన్న కర్కశ ప్రభుత్వం మావోయిస్టులను లొంగదీసుకుంటున్న తీరు బాధాకరం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో తుపాకీ ద్వారా పోరాటం కష్టం.
రాజకీయ ప్రక్రియలో మీరంతా భాగం కావాలని కోరుతున్నా.
రాజకీయంగా మాలాంటి వాళ్లకు దారి చూపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.
ఇక సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా అర్వపల్లి కేజీబీవీ వెళ్లాం.
అక్కడ దోమలు, కోతుల బెడద తో తీవ్ర సమస్యలు ఉన్నాయి.
ఆడపిల్లలే కాదా అని చులకనగా చూస్తే చరిత్ర మార్చేస్తారని హెచ్చరిస్తున్నా.
వెంటనే ఈ స్కూల్ లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా.
ఎస్సారెస్పీ కాల్వ దగ్గర చూసిన కాల్వలు మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అన్ లైన్డ్ కెనాల్స్ తో మనకు అన్యాయం చేశారు.
తెలంగాణ వచ్చాక మనం సరిచేసుకుంది ఏమీ లేదు. కనీసం మెయింటెనెన్స్ కు రూపాయి కూడా ఇవ్వలేదు.
ఆపరేషన్స్ అండే మెయింటెనెన్స్ విభాగానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పైసా నిధులు ఇవ్వలేదు.
రుద్రమ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని బీఆర్ఎస్ మాట ఇచ్చింది.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మాట ఇచ్చింది. కానీ చేయలేదు.
వెంటనే రుద్రమ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ గా మార్చాలి.
తుంగతుర్తి లో 100 పడకల హాస్పిటల్ పూర్తి కాలేదు. ఉన్న 30 పడకల హాస్పిటల్ ను కూల్చేసి 12 బెడ్స్ చేశారు.
విచిత్రంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు రెండుసార్లు శంకుస్థాపన చేశారు.
కానీ పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవటంతో పనులు చేయలేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు.
ఆయనకు జిల్లాలో మూడు హాస్పిటల్స్ నిర్మాణం టెండర్ వస్తే ఒకటి తర్వాత ఒకటి కడతామంటున్నారు.
అగ్రిమెంట్ లో ఉన్న సమయం దాటిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ అంశాన్ని కలెక్టర్ పరిశీలించాలి.
గుండ్ల సింగారం లో బ్రిడ్జి పరిస్థితి దారుణంగా ఉంది. దాని స్థానంలో కొత్తది నిర్మించాలి.
తుంగతుర్తి, సుర్యాపేట్ లో 20 రోజులుగా మిషన్ భగీరథ మంచి నీళ్లు వస్తలేవు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలి. గత ప్రభుత్వంలోనే ఇసుక బుక్కారు. ఇప్పుడు ఉన్న వాళ్లు కూడా ఇసుక బుక్కుతున్నారు.
కానీ దాని కారణంగా బ్రిడ్జిల కూలే పరిస్థితి వస్తుంది.
ఇసుక విషయంలో ఏ ప్రభుత్వం వచ్చిన సరే మ్యాచ్ ఫిక్సింగ్ తో దోపిడీ చేస్తున్నారు. తుంగతుర్తి ని మున్సిపాలిటీ చేయలేదు. ఎందుకు చేస్తలేరని ప్రజలు అడుగుతున్నారు.
సూర్యాపేట్ లో ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ ఆఫీస్ ఊరిలో కట్టాల్సి ఉండగా ఊరి బయట కట్టారు. టౌన్ లో రోడ్ వెడల్పు కోసం నోటీసులు ఇచ్చిన మూడు రోజుల్లో 300 వందల షాప్ లు కూల్చేశారు. 8 ఏళ్లుగా వారికి పరిహారం ఇవ్వలేదు.కేసు వేసిన వాళ్లను భయపెడుతున్నారు.
కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ 3 వందల షాప్ ల వారికి పరిహారం ఇప్పించాలి.
ఇంటిగ్రేటేడ్ వెజ్- నాజ్ వెజ్ మార్కెట్ 50 కోట్లో, 36 కోట్లతోనే కట్టారు అంటున్నారు.
కానీ అక్కడ ఉన్న సమస్యలతో అది అందుబాటులోకి రాలేదు.
జగదీష్ రెడ్డి గారు మంత్రి గా ఉన్న సూర్యాపేట్ పరిస్థితి మారలేదు.
కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడైనా ప్రజలకు మంచి చేసేలా ఆయన ప్రయత్నం చేయాలి.
టౌన్ లో పూల్లారెడ్డి చెరువు ను ట్యాంక్ బండ్ చేస్తామని చేయలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికలు అనగానే హడావుడిగా సీసీ రోడ్డు వేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మారాక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం వాటిని తవ్వతున్నారు.
అంటే ఎవరికీ లాభం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేయటం చూస్తుంటే బాధనిపిస్తోంది. వాగుల్లో కట్టి చెక్ డ్యామ్ లు ఏడాదికే కొట్టుకుపోయాయి. టౌన్ లో ఆత్మగౌరవ కుల భవనాలు ఇవ్వలేదు. సూర్యాపేట్ లో 9 వందలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు. వాటిలో 8 వందల మందికి సున్నం కూడా వేయకుండా ఇచ్చేశారు. ఇవ్వలేదు. చీదేళ్ల లో డబుల్ బెడ్ రూమ్ లు కూడా ఎలాంటి వసతులు లేకుండా ఇచ్చేశారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ లో 300 మంది ఫ్రొఫెసర్లకు గాను 150 మంది మాత్రమే ఉన్నారు. ఇక చీదేళ్ల గ్రామాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు దత్తత తీసుకున్నారంట. అక్కడి ఆరు కిలోమీటర్ల రోడ్డు పై ప్రయాణించాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించినంత సమయం పడుతోంది. రోడ్డు పూర్తిగా ఆధ్వాన్నంగా గుంతలతో నిండి ఉంది. వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నా. హుజుర్ నగర్ లో కూడా 14 ఏళ్ల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్న సమయంలో కట్టిన 2 వేల ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా వాటిని అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. కృష్ణానది మట్టంపల్లి వద్ద ఓ ఫార్మా కంపెనీ వాడు మొత్తం వెస్టేజ్ పడేశాడు. దీంతో వంద గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ వెస్టేజ్ పడేసిన ఫార్మా కంపెనీని గుర్తించలేదు. నిఘా వ్యవస్థ, పోలీసులు ఏం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రశ్నిస్తున్నా.
ఎస్సారెస్సీ స్టేజ్- 2 లో భాగంగా సూర్యాపేట్ లో ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. రిజర్వాయర్లు కడితినే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి ప్రజలకు మేలు జరుగుతుంది.అదే విధంగా కాల్వలకు కూడా లైనింగ్ వేయించాలని డిమాండ్ చేస్తున్నా. 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చే మూసీ గేట్ గతంలో ఊడిపోయింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు 280 కోట్లతో ప్రాజెక్ట్ కడతామని అన్నారు. కానీ ఇప్పటికీ అతిగతీ లేదు. హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 54 లిప్ట్ లు ఉంటే 17 లిప్ట్ ల పాక్షిక్షంగా, 21 లిప్ట్ లు పూర్తిగా పనిచేస్తలేవు.వీటన్నింటిని కాదని గతంలో బీఆర్ఎస్ 1450 కోట్లతో మెగా లిప్ట్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. అప్పుడు దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు 500 కోట్లు పెంచి వేగంగా ఆ లిప్ట్ పనులను చేస్తున్నారు. మూడేళ్లలో ఏమీ మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లిప్ట్ పనులను చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. లిఫ్ట్ ల రిపేర్ కు డబ్బులు ఇస్తారా? అదే విధంగా మెగా లిప్ట్ లో మీ వాటా ఎంతో చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే 13 వేల ఎకరాల సున్నపు గనులు పోయాయి.పులిచింతల ప్రాజెక్ట్ ద్వారా మనకు నష్టం జరిగితే కూడా ఆయన మాట్లాడలేదు. ఆంధ్రా ప్రభుత్వం 36 టీఎంసీల నీటిని ఆపితే మటంపల్లి వద్ద లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మునిగిపోతుంది. మీకు స్వామి మీద భక్తి ఉంటే 30 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు స్టోర్ చేయకుండా ఆంధ్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలి. నాగార్జున సాగర్ లెప్ట్ కెనాల్ మెయింటెన్స్ ను పట్టించుకోవటం లేదు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి.1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ నిందితులపై ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేరు. ఊరి మధ్యలో కట్టాల్సిన కలెక్టరేట్ ను ఊరి అవతల ప్రైవేట్ వెంచర్ లో కట్టారు. పైగా అక్కడ 25 ఎకరాలను రూ. 25 లక్షలు ఇచ్చి కొన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ లో భూమి పోయిన రైతులకు కూడా ఎకరాకు ఇంత పరిహారం ఇవ్వలేదు. జగదీష్ అన్న చాలా స్పెషల్ కాబట్టి ఆయన ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పించుకున్నారు. ఆ చుట్టుపక్కల 3 వందల ఎకరాలు వెంచర్లు వేసి అక్రమాలు చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫ్రెండ్స్ కనుక చర్యలు ఉండవు. కానీ తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలని నేను చెబుతున్నా. జగదీష్ రెడ్డి మనుషులకు దేవుళ్లు, చెరువులు అన్న కూడా లెక్కలేదు. కర్నాల చెరువు ను కూడా ఆక్రమించారు. అలుగు పోయే దాని మీద రోడ్డు వేశారు.
దీనిపై నేను గూగుల్ ఫోటోస్ తో హైడ్రాకు ఫిర్యాదు చేస్తా.
చర్యలు తీసుకుంటారో లేదో అన్న దాన్ని బట్టి ఉత్తమ్, జగదీష్ రెడ్డి ల అండర్ స్టాండింగ్ తెలుస్తుంది. విజయవాడ-సూర్యాపేట హై వే వెంచర్ లో కూడా అక్రమాలు జరిగాయి. వాటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. జీవో 58, 59 ను అడ్డుపెట్టుకొని సూర్యాపేట్ లో 5 ఎకరాల భూమిని రైగ్యులరైజ్ చేసుకున్నారు. గుర్రంపోడు భూముల విషయంలో స్కామ్ జరిగినట్లు గతంలో పెద్ద వివాదం నడిచింది. కానీ ఈ ప్రభుత్వం కూడా దానిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలి.చివ్వెల మండలంలో ఆరు ఎకరాల భూమి దేవుడి భూములను కబ్జా చేశారు.
ఎండో మెంట్ అధికారులు కచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలి. టౌన్ లోని ఆటో నగర్ వాళ్లకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి 5 ఎకరాలు కూడా ఇవ్వలేదు.
జగదీష్ అన్న వాళ్ల అమ్మ బర్త్ డే సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టి దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు తీశారు.
పోటీల సందర్భంగా వీళ్లు అస్తవ్యస్థంగా చేసిన ఏర్పాట్లతో ఒకరు చనిపోయారు. 26 మందికి గాయాలయ్యాయి.
వారికి ఉచితంగా వైద్యం కూడా చేయించలేదు. దీంతో వాళ్లంతా తెలంగాణ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అవకాశం ఉంటే ఆ గాయపడిన వారికి చికిత్స అందించాలి. జగదీష్ రెడ్డి, హరీష్ రావు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. వాళ్ల అవినీతి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అవినీతి లేకుండా ఉన్నప్పుడే అట్టడుగున్న ఉన్న ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. లేదంటే అవినీతి తో అక్రమార్జన చేసి మళ్లీ ఎలక్షన్స్ లో ఖర్చు చేస్తారు. పది వేల రూపాయలు ఓటుకు ఇచ్చి తండ్రిని సర్పంచ్ గా గెలిపించుకుంటారు. అవినీతి కారణంగా ప్రజలకు కావాల్సిన మేలు, ప్రయోజనాలు జరగవు. నేను మాట్లాడటం కారణంగా జగదీష్ రెడ్డి చుట్టు ఉన్న వాళ్లు నాపై ఏడుస్తారు.కానీ సూర్యాపేట్ జిల్లాలోని పది లక్షల మంది ప్రజల కోసం మాట్లాడుతున్నాను.
ఇప్పటికైనా సరే మనం అవినీతి లేకుండా తెలంగాణను బాగు చేసుకోవాలి. వ్యవస్థలో లిమిటెడ్ గా ఉన్న అవినీతిని మనం ఆపలేము. కానీ ఇష్టానుసారంగా అవినీతి పాల్పడటం కరెక్ట్ కాదు. అడ్డగోలుగా అవినీతి చేసే వ్యక్తులపై నేను మాట్లాడుతూనే ఉంటా. యూరియా కోసం యాప్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టాలి. లేదంటే వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. పార్టీనే వద్దనుకున్నా తర్వాత నైతికతతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను.నేను జాగృతి ఏర్పాటు కు ముందు లక్షన్నర కిలోమీటర్లు తిరిగి అధ్యయనం చేశాను.
ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యలపై అధ్యయనం చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో రెండు రోజులు ఉంటూ ప్రతి సమస్యపై మాట్లాడుతున్నా నాయకులు ఎవరైనా ఉన్నారా?
బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయంపై మాట్లాడుతూనే ఇప్పుడు ఎలా బాగు చేయాలని చూస్తున్నాం.