నుజ్జు నుజ్జు అయిన ఇద్దరు విద్యార్థులు
యాదాద్రి భువనగిరి 04 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తుండగా వలిగొండ ప్రధాన రహదారిపై లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.మృతులు మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ (తండ్రి: లేట్ బోళ్ల సంపత్) మరియు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ (తండ్రి: కుక్కల యాదగిరి)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఘటన స్థలానికి సమాచారం అందుకున్న వెంటనే బంధువులు, గ్రామస్తులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారిని కలచివేశాయి.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాల వేగ నియంత్రణ, భద్రతపై మరోసారి ప్రశ్నలు లేపుతోంది..... దీంతో వివిధ గ్రామాలు విషాద ఛాయలతో అల్మకున్నాయి