జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన జూపల్లి అరుణ్
జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజా సమస్యలపై పోరాటం చేయవచ్చు
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : జర్నలిస్టులకు అండగా రత్నగిరి ఫౌండేషన్. మెగా హెల్త్ క్యాంపు నిర్వహణఅభినందనీయం.రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్.ప్రజా సమస్యలపైనే నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులు వారి ఆరోగ్యాలను కాపాడాలన్న లక్ష్యంతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అండగా నిలిచి ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని వారికి ఎల్లవేళలా రత్నగిరి ఫౌండేషన్ అండగా ఉంటుందని రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సాయి గార్డెన్లో యశోద ఆస్పత్రి మలక్ పేట సహకారంతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఆయన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ తో పాటు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం చేస్తున్న జర్నలిస్టుల మనిషి శరీరంలోని గుండెకాయ లాంటి వారిని అన్నారు. వారిని వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్న వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అలాంటి ఈ ప్రాంత జిల్లా జర్నలిస్టులకు రత్నగిరి ఫౌండేషన్ ఎప్పటికీ అండగానే ఉంటుందన్నారు. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇచ్చివారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ కోరారు. మెగా హెల్త్ క్యాంపు నిర్వహణలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ సురేష్ కుమార్ ఎంతగానో శ్రమిస్తున్నారని వారిని ఈ సందర్భంగా అభినందించారు.