విద్యార్థులకు బహుమతులు అందజేత
తిరుమలగిరి 02 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మంద పద్మా రెడ్డి తన జన్మదిన సందర్భంగా పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న 85 మంది విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. అదేవిధంగా 9వ తరగతిలో అత్యధిక మార్కుల సంపాదించిన మొదటి విద్యార్థికి 1500 రెండో విద్యార్థికి వెయ్యి రూపాయలు నగదు పారితోషికం అందించారు ఈ సందర్భంగా మంద పద్మా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి పాఠశాల మంచి పేరు తేవాలని అన్నాడు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి మరో విశ్రాంత ఉపాధ్యాయుడు కృష్ణమాచార్యుడు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు సున్నపోజు సోమయ్య ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు