నవ భారత్ సాక్షరతా అవగాహన కార్యక్రమం

చిన్నంబావి, మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ దగడలో ఉల్లాస్ నవ భారత్ సాక్షరత కార్యక్రమం పై అవగాహన సమావేశం జరిగింది. ప్రతి గ్రామపంచాయతీ నుండి ఒక ఉపాధ్యాయుడు, ఒక వివోఏ లు పాల్గొనేలా ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యా అధికారి పి.ఆర్. రాజేందర్ రావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం సమాజంలో జీవితాంతం నేర్చుకునే వాతావరణాన్ని ఏర్పరచడమే ప్రధాన లక్ష్యం. 15 సంవత్సరాలు పైబడిన మరియు అధికారిక విద్యను కోల్పోయిన నిరక్షరాసుల కోసం బలమైన అభ్యాస పర్యావరణాన్ని సృష్టించడం ద్వారా వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఉల్లాస్ యొక్క ఉద్దేశ్యం” అని అన్నారు.ఈ సమావేశంలో రిసోర్స్ పర్సన్స్‌గా అనుకలి శివరాముడు, కే. శివశంకర్, సెర్ప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్యామల, మాధవ స్వామి తదితరులు పాల్గొని కార్యక్రమం ప్రాముఖ్యతపై సూచనలు ఇచ్చారు.