జనాభా దామాషాలో  రాజాధికారం దక్కాలి  రాజ్యం బీసీల పరం కావాలి

Jul 2, 2024 - 21:55
 0  8

విద్యావంతులైన బీసీలు  రాజకీయాలలోకి చురుకుగా రావాలి

.గ్రామీణ ప్రాంత పదవులతో పాటు  రాష్ట్ర నాయకత్వం

ప్రధాన పదవులను  చేజెక్కించుకోవాలి . నాయకత్వంలో

ఉన్నవాళ్లు తమ వర్గానికే ప్రాధాన్యతిస్తారు  

కనుక బీసీలుగా అధికారం కోసం కొట్లాడి సాధించుకోవాలి.

----వడ్డేపల్లి మల్లేశం

కుల వ్యవస్థ బలంగా ఉన్న ఈ దేశంలో  ఆయా కులాలు వర్గాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారంలో వాటా దక్కాల్సిన అవసరం ఉన్నది  కానీ 1 శాతం,  0.5%  ఉన్నటువంటి కొన్ని ఆదిత్య కులాలకు మాత్రమే  రాజ్యాధికారము దఖలు పరచబడి  మెజారిటీ ప్రజానీకం  ఓటు బ్యాంకుగా  యాచకులుగా బానిసలుగా మాత్రమే కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులను  తిరగరాయాల్సినటువంటి అవసరం ఎంతగానో వుంది.   ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా    రిజర్వేషన్ సౌకర్యంతో పాటు  విద్యా ఉద్యోగాలలో అవకాశాలు ఉన్న కారణంగా కొంత మెరుగుదల  ఉన్నమాట వాస్తవం కానీ మైనారిటీగా ఉన్నటువంటి ఈ రెండు వర్గాలపైన సామాజికపరంగా అగ్రవర్ణాల దాడులు కొనసాగడాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది .ఇక 56% నుండి 60 శాతం గా ఉన్నటువంటి మెజారిటీ ప్రజానీకమైనటువంటి బీసీలు  చట్టబద్ధమైన అవకాశం లేని కారణంగా రాజ్యాధికారంకు దూరమై బిపి మండల్ కమిటీ సిఫారసు మేరకు  విద్య ఉద్యోగాలలో 27% ఆనాడు ఉన్నటువంటి ప్రధాని వీపీ సింగ్ హయాంలో అమలు జరిపినప్పటికీ  ప్రస్తుతం కనీసం 10% కూడా అమలుకు నోచుకోలేదంటే పాలకుల యొక్క దుష్ట చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . ఇక స్థానిక సంస్థలలో  బీసీలకు సుమారు 50 శాతం  దక్కాల్సినటువంటి పరిస్థితులలో  27% నుండి 20- 18_ 14 శాతానికి కుది0చబడినటువంటి దౌర్భాగ్య పరిస్థితులను తెలుగు రాష్ట్రాలలోనూ ఇతర రాష్ట్రాలలోనూ మనం గమనించవచ్చు.  అందుకే  ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్, జెడ్పిటిసి,  ఎంపీపీ,  జెడ్పీ చైర్మన్,  మార్కెట్ కమిటీలు ఇతరత్రా అనేక స్థానిక సంస్థలు రాజ్యాధికార సంస్థలలో  మెజార్టీ ప్రజానీకం కాకుండా మైనారిటీగా ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు మాత్రమే అధికారంలో కూర్చోవడాన్ని మనం గమనించవచ్చు.  ఇటీవల 2023లో  కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా  బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ  ఆ వైపుగా చర్యలు లేవు కానీ ఎన్నికలు  నిర్వహించబోయే క్రమములో రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ వర్గాలు  ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు ఏ మేరకు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందొ వేచి చూడాల్సిన అవసరం చాలా ఉన్నది.
      తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు  అత్యంత వెనుకబడిన వాళ్లు సంచార జాతులు ఉత్పత్తి కులాల వాళ్ళు  సేవారంగంలో  వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి మెజారిటీ వర్గాలు ఉత్పత్తిని సృష్టించే క్రమంలో  ముందు వరుసలో ఉన్నప్పటికీ వీరికి రాజ్యాధికారంలో వాటా లేకపోవడం సిగ్గుచేటు.  ఎంతసేపు ఈ వర్గాలు ఉత్పత్తిలో భాగస్వాములై చెమట వడి సి  కష్టించి బ్రతకడానికి మాత్రమే అలవాటు పడినారు కానీ ఈ దేశాన్ని రాజ్యాన్ని స్థానిక సంస్థలను పరిపాలించడానికి అవకాశం లేక అవకాశం రాక  ప్రేక్షక పాత్ర వహిస్తున్న విషయం చాలా విచారకరం . బీసీ వర్గాల్లో ఉన్నటువంటి విద్యావంతులు ప్రజాస్వామికవాదులు ఆలోచన పరులు ఇటీవలి కాలంలో  రాజకీయాల వైపు దృష్టి సారించవలసినటువంటి  సామాజిక బాధ్యత వీరి పైన ఉన్నది.  బీసీ వర్గాలను రాజకీయాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలను చే దించాలంటే  ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల నాయకత్వంలో ఉన్న కారణంగా  ఏ పదవిలోనూ నామినేటెడ్ పోస్టులలోనూ బీసీ వర్గాలకు అవకాశం దొరకడం లేదు. మరొక కారణం  డబ్బున్న వాళ్లకు మాత్రమే  టిక్కెట్టు ఇచ్చేటువంటి దురలవాటు ఉన్న కారణంగా పేద వర్గాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలను పక్కనపెట్టి డబ్బు లేదు కనుక మీరు గెలవరు అని  అధికారానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇన్ని రకాలైనటువంటి దురాగతాలకు  చెక్ పెట్టాలంటే  బీసీ వర్గాల యొక్క చైతన్యం మాత్రమే పని చేస్తుంది  అన్ని రాజకీయ పార్టీల్లోనూ క్షేత్రస్థాయి నుండి రాష్ట్రస్థాయి దేశ జాతీయస్థాయి వరకు నాయకత్వ స్థాయికి ఎదగాలి. అదే క్రమంలో టిక్కెట్ల కేటాయింపు కానీ ఇతరత్రా చర్చలు సంప్రదింపుల సమయంలోనూ రాజీ లేకుండా పోరాటం చేయడం ద్వారా తమ సత్తాను ప్రదర్శించాలి. తాము లేకుంటే మీ ఉనికే లేదని త మ ఓట్ల ద్వారానే మీరు అధికారంలోకి వస్తున్నారని నిగ్గదీసి అడగగలిగినప్పుడు ఖచ్చితంగా ఆధిపత్య కులాలు బిసి వర్గాలకు ఉచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.  బీసీ వర్గాలు వెనుకబడిన తరగతులకు  సంచార జాతులకు చెందిన వాళ్లు రాజ్యాధికారంలో వివిధ ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ వర్గాలకు భరోసా లభించే అవకాశం ఉంటుంది కానీ ఆధిపత్య కులాల చేతుల్లో అధికారం ఉన్న కారణంగా వాళ్ళు ఆదివాసులు గిరిజనులు అట్టడుగు వర్గాల గురించి పట్టించుకోవడం లేదు అని విమర్శ సర్వత్ర వినబడుతున్నది .
   ఇటీవల రాహుల్ గాంధీ తన  భారత్ జోడోయాత్ర సందర్భంగా కుల గణన లెక్కించడం ద్వారా బీసీ వర్గాలకు ఉచిత ప్రాధాన్యత ఇస్తామని వాళ్లకు ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ  అధికారంలో ఉన్న  బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా కుల గణనను వ్యతిరేకిస్తూ  కులతత్వం పెరిగిపోతుందని బిసి వర్గానికి చెందినట్లుగా చెప్పబడుతున్న  ప్రధాని అయి కూడా మోడీ ఆ డిమాండ్ ను అర్థం చేసుకోకపోవడం విచారకరం. సర్వోన్నత న్యాయస్థానం కూడా కులగణన గురించి ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం అంటే ప్రజల చైతన్యాన్ని నీ రుగార్చడమే. చట్టాలు, న్యాయస్థానాలు,  పార్లమెంటు కూడా  ప్రజాభిప్రాయాన్ని మన్నించనప్పుడు బీసీ వర్గాలుగా బీసీ సంఘాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా బలోపేతమై ఉమ్మడి చైతన్య కార్యక్రమాల ద్వారా పోరాటాలను ఉధృతం చేస్తే తప్పకుండా అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలు దిగిరాక తప్పదు.  సమాజంలోని అన్ని వర్గాలకు కూడా ఎవరి శాతం వాటవారికి ఇచ్చినప్పుడు ఈ సమస్య ఉండదు కానీ అత్యల్ప స్థాయిలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మొత్తం 100%  ప్రజానీకాన్ని  వర్గాలను పాలించడానికి  అధికారం కోసం అరులు చాస్తుo టే దాని వెనుక ఉన్న కుట్రను చేదించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో తమ వాటా తమకు కావాలని బీసీలు డిమాండ్ చేస్తే సుమారు 60% వాటా బీసీ వర్గాలకు దక్కే అవకాశం ఉంది చిన్న ఉద్యోగం నుండి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని పదవుల్లోనూ 60 శాతం వాటా పొందడానికి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు గాని ఆధిపత్య వర్గాలు  తక్కువ సంఖ్యలో ఉండి రాజ్యాధికారం చలాయిస్తున్నటువంటి శ్రేణులు  ప్రజల ముందు మోకరిల్లక తప్పదు.  అప్పుడే ఈ దేశం రాజ్యం బీసీల పరం అవుతుంది  అంత వరదాకా బీసీలు నిద్రపోకుండా, మొద్దు బారి ఉండకుండా , చైతన్యముతో తమ హక్కుల కోసం పోరాటం నిరంతరం చేస్తూనే ఉండాలి . పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప........  వచ్చేది రాజ్యాధికారమే  సుమా !
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333