పాఠకుల సంఖ్య పెరిగి మహాపాటకులై తె వారంతా రచయితలు, కవులు, కళాకారులే
వృత్తి కళాకారులు ఉత్పత్తిలో
భాగస్వాములైనట్లు అధ్యయనశీలురoదరు
సమాజ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుతారు.
సాహిత్యము ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనమిదే.
----వడ్డేపల్లి మల్లేశం
సాహిత్యం యొక్క సామాజిక ప్రయోజనాన్ని పరిశీలించినప్పుడు మానవ మనుగడ సమాజం యొక్క ప్రతి కదలిక ఇoదులో అంతర్గతంగా దాగి ఉంటుంది . సమాజం యొక్క హితాన్ని కోరేది సాహిత్యమని గతంలో చెప్పుకుంటే ప్రస్తుతం దాన్ని మరింత విస్తృత పరుచుకోవాల్సిన అవసరం ఉన్నది . "సమాజం యొక్క హితాన్ని కోరడమే కాదు ఆ మేలును సమాజానికి చేకూర్చే క్రమంలో కవులు రచయితలు కళాకారులు సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకొని పోరాటం చేయవలసిన అవసరం ఉంది అని నేటి పరిస్థితులు రచయితలకు మరింత బాధ్యతను అంటగట్టిన విషయాన్ని ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది". ఈ పరిస్థితుల్లో సాహిత్యం ఏ రకంగా సమాజంలోకి దాని ప్రయోజనాన్ని మూలమూలకు గడపగడపకు ఎలా విస్తరించవచ్చు ? దానికి వివిధ ప్రాంతాలలో ప్రతినిధులను ఏ రకంగా ఏర్పాటు చేసుకోవచ్చు? అనేది కొంత లోతుగా వెళ్లి అధ్యయనం చేస్తే సమాజంలోని భిన్న వర్గాలు సామాజిక కార్యకర్తలు ఆలోచనపరులు బుద్ధి జీవులు, విద్యావంతులు స్పృహ గల వాళ్లందరూ ఎక్కడికక్కడ
ఆ గురుతరమైన పాత్రను పోషించవలసిన అవసరం ఉన్నది .ఒక అంచనా ప్రకారం గా ప్రస్తుతం ముద్రించబడుతున్నటువంటి పత్రికలు బులెట్ పుస్తకాలు ఇతరత్రా ఏ సాహిత్యమైన కేవలం 13 శాతం మంది మాత్రమే పాఠకులు అధ్యయనం చేస్తున్నట్లు పెద్ద మొత్తంలో సాహిత్యానికి దూరంగా పరిశీలన అధ్యయనము చదవకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. చదువు రాని నిరక్షరాస్యులు ఎలాగూ చదవలేరు కానీ విద్యావంతులై ఉండి కూడా వివిధ రకాల జ్ఞానం అన్వేషణ పరిశోధన అంశాలను అనేకమంది రచయితలు మన ముందుంచినప్పుడు చదవడానికి సిద్ధపడకపోతే మనలో స్పృహ లేదు ఇతరులకు ఆ స్పృహను అందించలేము ఈ రకంగా సమాజం యొక్క అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉన్నది కదా! .
పాఠకుల సంఖ్యను భారీగా పెంచుకోవాలి :-
********
పాఠశాల స్థాయి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు వివిధ ప్రాంతాలలో నెలకొల్పినటువంటి గ్రంథాలయాల ద్వారా కుటుంబాలలో ఉన్నటువంటి కథలు ఇతర సాహిత్య పుస్తకాలను కూడా కుటుంబ సభ్యులు నిరంతరం చదివే అలవాటును పోషించి పెంచవలసిన అవసరం ఎంతగానో ఉన్నది . గ్రామ గ్రామాన కూడా గ్రంథాలయాలను స్థాపించి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పించడంతోపాటు గ్రామాలలో విస్తృత ప్రచారం చేయడం కూడా పాఠకుల సంఖ్యను పెంచడానికి కారణమవుతుంది. అదే రకంగా పట్టణ ప్రాంతాలలో వీధి వీధికి గ్రంథాలయాలను స్థాపించడంతోపాటు పోటీ పరీక్షలకు ఇతర శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించిన పత్రికలు పుస్తకాలు బులెట్లను ప్రాచీన గ్రంథాలను అందుబాటులో ఉంచడం ద్వారా చదువర్ల సంఖ్యను భారీగా పెంచడానికి అవకాశం ఉంటుంది. తెలియని ఏ విషయమైనా తెలుసుకునే క్రమంలో జ్ఞానం వికసించి నూతన పరికల్పనలకు అన్వేషణకు ఆలోచనలు పెంచుకోవడానికి దారితీస్తుంది ."ఆ క్రమంలో పాఠకులు తమ అధ్యయనాన్ని పెంచుకోవడం ద్వారా మహాపాటకులుగా మారుతారు మహాపాటకులుగా మారిన వాళ్లందరూ కూడా చదువే క్రమంలో పరిశీలన దృక్పథంతో అధ్యయన కోణంలో ఆలోచించడంతో మాట మహాపాటకుల నుండి రచయితలు కవులు సామాజిక కార్యకర్తలు మేధావులుగా కళాకారులుగా తీర్చిదిద్దబడే అవకాశం ఉంటుంది ."
ఒక రచన మనసులో బాధ్యతను గుర్తింపజేసి, సోయని చెప్పించి, చారిత్రక గమనాన్ని వర్తమాన అంశాలను భవిష్యత్తు కర్తవ్యాలను గుర్తింపచేసే లక్షణం తనలో నింపుకొని ఉంటుంది. అంటే స్పృహను పెంచుకోవడానికి, చైతన్యముతో ముందుకు వెళ్లడానికి, బాధ్యతను మరింత సమర్థవంతంగా గుర్తించడానికి , కర్తవ్యాలను మరింత పకడ్బందీగా నిర్వహించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ."శ్రమకు ఉత్పత్తికి దూరంగా ఉంటున్న అనేక కుటుంబాలు ఏరకంగా నైతే ఆదాయానికి నోచుకోవో చదువుకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు వ్యక్తులు, శక్తులు చైతన్యాన్ని సంతరించుకోలేరు. సోమరిపోతులుగా, బాధ్యతారాహిత్యం గల వ్యక్తులుగా , వ్యవస్థ మార్పును కోరనటువంటి స్తబ్దుల్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది అంటే పాఠకులు కాని వారి వలన వ్యవస్థకు ఎంత నష్టమో అర్థం చేసుకోవచ్చు .
రచయితలు సామాజిక కార్యకర్తలు సమాజ పునర్నిర్మాణానికి వారసులు:-
**"****
కేవలం రచనలు చేసే వాళ్లే కాకుండా సమాజ అంశాల పట్ల అవగాహన కలిగి ఉండి చర్చలు సంప్రదింపులు చేసి వ క్తగా తమ అభిప్రాయాలను బల్లగుద్దినట్లు ప్రకటించగలిగిన వాళ్లంతా కవులు కళాకారులు మేధావులు రచయితలు గానే గుర్తించాలి. . ఇటీవలి కాలంలో యూట్యూబ్ ద్వారా నిరంతరం వస్తున్నటువంటి సామాజిక పరిణామ అంశాల పైన కొత్త అంశాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం వివరించడం జరుగుతున్నది అలాంటి ప్రసంగాలను కూడా వినడం పాటకుల యొక్క బాధ్యత లక్ష్యం కావాలి . ఒక రచన లోని అంతరార్తాన్ని కళాకారులు ప్రజల ముందు ఉంచే క్రమంలో సంభాషణల ద్వారా మానసిక పరివర్తనకు సామాజికతకు నాటకాలు సంభాషణలు ఇతర ప్రదర్శనల ద్వారా ఎంతో తోడ్పడుతున్న విషయాన్ని కూడా మనం ఆకలింపు చేసుకోవాలి. రచన రూపంలో ప్రారంభమైనటువంటి సాహిత్యం చదివే వాళ్లకు, రాసే వాళ్లకు, ప్రదర్శించే వాళ్లకు, నాటకాలు వేసే వాళ్లకు, ప్రసంగించే వాళ్లకు మూల స్తంభముగా పనిచేస్తున్న విషయాన్ని గమనించినప్పుడు పాఠకులు కొరవడితే ఈ దేశంలో సాహిత్యం ఎంత మరువన పడిపోతుందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. పాఠశాల స్థాయిలోపల అధ్యయనాన్ని రచనను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వెళ్లడానికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పోటీలను నిర్వహించడం ద్వారా కాలానుగుణంగా సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక సాంస్కృతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందుకోవడానికి వాటిపైన దృష్టి సాధించడానికి పట్టు సాధించడానికి అవసరమైన సందర్భంలో సామాజిక ఉపయోగ కార్యక్రమాలలో క్షేత్రస్థాయిలో పని చేసినప్పుడు వినియోగించడానికి అందరికీ ఆస్కారం ఉంటుంది . "సామాజిక మార్పుకు సాహిత్యం ఉపయోగపడాలనుకున్నప్పుడు ఇది ఒక రకమైన ఉద్యోగము వ్యాపారము వేతనంతో కూడుకున్న వ్యవస్థను కాదు" బుద్ధిమంతులు మేధావులు, రచయితలు పాఠకులు ఎదిగినటువంటి వర్గమంతా తమ యొక్క చైతన్యాన్ని స్పృహను సమర్థతను ఈ వ్యవస్థ మార్పు కోసం వినియోగించి అంతరాలు అసమానతలు లేని సమాజాన్ని స్థాపించే క్రమంలో అంతిమంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేయవలసినటువంటి బాధ్యత ఈ దేశ పౌరుల పైన బుద్ధి జీవుల పైన ఆలోచన పరుల పైన ఉంది. అందుకే ఎంత ఎక్కువ సంఖ్యలో రచనలు చేయడం ఆ రచనలను పాఠకులుగా చదివి మహాపాటకులై తిరిగి తిరిగి రచయితలుగా ఎదిగిన నాడు పనిచేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, ఆలోచించే వాళ్ళ సంఖ్య గొప్పగా మారుతుంది , సమాజ పునర్ నిర్మాణానికి అంకితమై పనిచేసే వాళ్లు ఆలోచిస్తారు, అందుకు ముందుకు వెళ్తారు, సంస్కరణ ప్రక్షాళన దిశగా కొనసాగే అవకాశం ఉంటుంది ." సమాజ మార్పుకు దోహదపడని సాహిత్యం తుప్పు పట్టినటువంటి కత్తిలాగానే సామాజిక చైతన్యానికి ప్రేరణకు సమసమాజ నిర్మాణానికి అంతరాలు లేని వ్యవస్థకు అభ్యుదయ భావజాలాన్ని సమాజంలో విస్తరింప చేయడానికి తోడ్పడనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన ప్రయోజనం లేదు." అందుకే పాఠకులు రచయితలు, తమ కోణాన్ని ధోరణిని సామాజిక స్పృహను చైతన్యాన్ని సామాజిక భాషలో సమానత్వాన్ని సాధించే క్రమంలో దృష్టి సారించడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే రచనలకు పాఠకులకు మహాపాటకులకు తిరిగి రచయితలుగా ఎదిగిన వాళ్లకు వాళ్ల కృషి ద్వారా సమాజ మార్పుకు అర్థం ఉంటుంది . ఇది ఒక చక్రం లాగా పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది రచయితలు రాస్తూ ఉంటే పాఠకులు చదువుతూ ఉంటే మహాపాటకుల నుండి తిరిగి రచయితలు ఉద్భవిస్తూ ఉంటే వాళ్లు సమాజం గురించి పాజిటివ్గా ఆలోచించి తిరిగి రాయడం ద్వారా నిరంతరం రచన ఆలోచన కొనసాగవలసిందే .ఇది ఒక సాహిత్య చక్రం ఇది ఒక సామాజిక అంశం సామాజిక పరిణామానికి అంతరాలు లేని వ్యవస్థ పరిణతికి దోహదపడాలని అందుకోసం చదువుకున్నవాళ్లు ఆలోచనపరులు సిద్ధంగా ఉండాలని మనసారా కోరుకుంట0. భారత సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సందర్భాలలో అభ్యుదయ భావజాలాన్ని, సామాజిక పరిణీథీ కి సంబంధించిన ఆలోచనలను కలిగి ఉండడం ప్రజల యొక్క రాజ్యాంగపరమైన హక్కు అని నిర్దేశించిన వేళ సామాజిక మార్పుకు విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్లడానికి సమాజంలోని భిన్న వర్గాలకు తోడుగా రచయితలు పాఠకులు , కళాకారులు చేయి చేయి కలిపి ఉత్తమ సమాజ నిర్మాణంలో తోడ్పడాలని మనసారా కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)