పెళ్ళిలో కొనసాగుతున్న ఆడంబరాలు
పెళ్ళిలలో కొనసాగుతున్న ఆడంబరాలు...
అధిక ఖర్చులపై ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్
జెఎస్ఆర్ సార్ పేద ప్రజలకు బహిరంగ లేఖ...
నేటి సమాజంలో పెళ్లిళ్ల పేరిట జరుగుతున్న దూబర ఖర్చులపై వింత పోకడలపై శ్రామిక వర్గ బోరపుత్రుడు .
కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోర దేవాన్ష్ జే కే ఆర్
జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ
.1 కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం* (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు)
2. ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపు తో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం... రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే.
3. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను,పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)
4.పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సాంస్కృతి. ఈమధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటినుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
5.పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకొ ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.
6. Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది.* (photographer bill కూడా లక్షల రూపాయలు)
7.పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం.
8. భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్* (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)
9 పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం*(ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), *అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.
10 పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.
11. DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో,అర్థం పర్థం లేని సినిమా పాటలు.
12. కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం*(వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).
13.ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events.
14. మద్యంతో కూడిన విందైతే, హాజరు 110% (బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).
15. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.
16. తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat
17. ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్*(.ఇది కూడా లక్షల్లో).
18. ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు
19. అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతు కి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు*. *ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని,ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం...
సర్వేజనా సుఖినోభవంతు.
ఈ పోస్ట్ చదివి కొంతమందన్నా మారుతారని కార్మిక వర్గ బోరపుత్రుడు... బాధితుల బంధువు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్. జె ఎస్ ఆర్ సార్ ఆశిస్తున్నారు. పీడిత ప్రజల సంక్షేమం కోసమే గత మూడు దశాబ్దాలుగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాతంత్ర ఉద్యమకారుడు, ప్రజా బంధువు అవార్డు గ్రహీత నిరంతర శ్రమజీవి ,కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జెకెఆర్ జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 8328277285 ఆశించినట్లుగా ...సమాజంలో ఒక మేరకైనా మార్పు రావాలని మనం కూడా అందులో భాగస్వాములు కావాలి . ఆర్భాటాలు అధిక ఖర్చులు లేని సామాజిక మార్పునకు శ్రీకారం పెళ్లిళ్లు పేదల పాలిట భారం కాకూడదని ఆశిద్దాo