మేధావులు శాస్త్రవేత్తలు సున్నితంగా మందలించినా దారికి రాని ప్రభుత్వాలతో ప్రయోజనం ఏమిటి
పరిశోధనలను ప్రోత్సహించిoది లేదు భవిష్యత్తుకు వాటిని వినియోగించుకున్నధీ లేదు.శాస్త్రం సంపన్న వర్గాలకు దోచిపెట్టకూడదన్న సతీష్ ధావన్
వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచంలోనే మానవ వనరులకు అగ్రగామిగా ఉన్న భారతదేశంలో శక్తి యుక్తులను శాస్త్రీయ పరిజ్ఞానాన్ని
దేశ అభివృద్ధికి ఉపయోగించుకో ని అసమర్థ దేశాలలో భారతదేశం ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ప్రభుత్వ ప్రోత్సాహం లేక శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రభుత్వం నిధులు కేటాయించని దౌర్భాగ్యస్థితిలో ఈ దేశం నుండి అనేక మంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన సందర్భాలను మనం గమనించవచ్చు . చేతులు కాలితే కానీ ఆకులు పట్టనటువంటి పాలకుల మధ్యన అపారమైన మేధా సంపత్తి కలిగిన వాళ్లు తట్టుకోవడం కష్టమే కనుక విదిలేని పరిస్థితిలో ఇతర దేశాల బాట పట్టిన సంగతి అత్యంత విషాదకరం . 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత 65 శాతం భారత జనాభాలో ఉన్నదంటే మన దేశం యువశక్తిలో అగ్రగామి అని చెప్పడంలో సందేహము లేదు ఉన్న యువశక్తిని దేశీ అవసరాల రీత్యా శాస్త్ర సాంకేతిక రంగాలలో వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తిలో భాగస్వాములను చేయడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ లోపల కూడా వారి సహకారాన్ని తీసుకోవడంలో ఈ దేశ పాలకులు చొరవ చూపనీ కారణంగా ప్రజాస్వామ్యం నిరంతరం విఫలం అవుతూనే ఉన్నది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు చిల్లులు పడుతూనే ఉన్నవి.
భారతదేశంలో ఎదిగిన అనేకమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, మేధావులు, సామాజికవేత్తలు విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న వాళ్లు ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి పరిశోధనలకు మరింత బాటలు వేయాలని, నిధులు కేటాయించాలని , శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత రాణించడం ద్వారా ప్రపంచంలో అగ్రగామిగా మారాలని చేస్తున్న హెచ్చరికలు ప్రభుత్వాలకు ఇచ్చిన సూచనలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏటిలో పిసికిన చింతపండు అయిపోయినది . డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి అనేక మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు చేసిన సూచనలు అమలు కాకపోవడంతో భారతదేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోవడానికి కారణం అవుతున్నది . రాజకీయ యంత్రాంగం తమ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఆరాటపడుతుంది తప్ప దేశ ప్రయోజనాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పుల ద్వారా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని ఆలోచన లేకపోవడంతో ఈ దేశంలో ఉన్న మానవ వనరులలో నిపుణులు ఎందరో ఉన్నప్పటికీ నిర్వీర్యం కావడంతో ఇతర దేశాల బాట పడుతున్న విషయాన్ని పాలకులు గమనించి సోయి తెచ్చుకోవాలి. ఈ సందర్భంగా అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ చేసిన హెచ్చరిక లేదా సూచనను పాలకవర్గాలు, శాస్త్రవేత్తలు, సమాజము యావత్తు గమనించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రభుత్వాలకు సతీష్ ధావన్ హెచ్చరిక
**********, .
"""సైన్స్ టెక్నాలజీలు ప్రగతి సాధనకు తోడ్పడే శక్తివంతమైన పనిముట్లు. వాటిని చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలి. అంతేకానీ సమాజంలో అతికొద్ది మంది సంపన్న వ్యాపారులకు లాభాలు ఆర్జించి పెట్టడానికి కాదు"""
- ప్రొఫెసర్ సతీష్ దావన్
ప్రపంచంలోనే అయిదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం త్వరలోనే మూడవ వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధానమంత్రి పదేపదే చెబుతున్నప్పటికీ మనదేశంలో ఉన్నటువంటి మానవ వనరుల కృషి వల్ల సాధించిన ప్రగతిని ఇతర దేశాల దయాదాక్షిన్యా నికి తాకట్టు పెట్టే పని సమంజసం కాదని అనేక మంది శాస్త్రవేత్తల హెచ్చరిక ద్వారా తెలుస్తున్నది. రాజ్యాంగంలోని ఆదేశిక సూ సూత్రాల ప్రకారంగా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదని అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించిన ప్రయోజనాలు ప్రజలందరికీ చేరాలని సంపద అందరికీ సమానంగా పరచబడాలని ఆదేశిస్తున్నప్పటికీ నిజ జీవితంలో దానికి భిన్నంగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు . పాలకుల యొక్క అసంధర్భ, అనాలోచిత, ఏకపక్ష విధానాల కారణంగా 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో చిక్కింది అంటే ప్రజల ప్రయోజనాల కోసం జీవన ప్రమాణాల పెంపుద దళకు కాకుండా కొద్దిమంది ప్రయోజనం కోసం వినియోగించినట్లే కదా! ఈ విషయంలో అంతరిక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ సతీష్ ధావన్ హెచ్చరిక ప్రకారం
దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రజల ప్రయోజనాల కోసం, జీవన ప్రమాణాల పెంపుదల కోసం, మరింత మెరుగైన సమాజం కోసం , సకల ప్రజానీకం కోసం వినియోగించాలి అని చెప్పినారే కానీ సంపన్న వర్గాల కోసం కాదు అని హెచ్చరించినప్పటికీ ఆచరణలో జరుగుతున్నది పెట్టుబడి దారి భూస్వామ్య పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు . ఆ కోవలోనే 16 లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామికవేత్తలు ఎగవేసి న సొమ్మును కేంద్రం మాఫీ చేసిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే .
ప్రజల ప్రస్తుత కర్తవ్యం
******
ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని, తద్వారా లభించిన ప్రయోజనాలను మెజారిటీ ప్రజానీకం కోసం ఉపయోగించాలని , సంపన్న వర్గాలకు మాత్రం కాదని హెచ్చరించాల్సిన అవసరం సామాన్య ప్రజానీకం పైన ఉన్నది. .ఈ దేశంలో ప్రజల సొమ్ముతో పట్టాలు పొంది ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రభుత్వాల అనాలోచిత ఆదరణ లేని కారణంగా ఇదంతా ఇతర దేశాలకు వలస పోతుంటే వారి పరిజ్ఞానం ఈ దేశానికి ఉపయోగపడకపోగా ఈ దేశ ప్రజల సొమ్ముతో లబ్ద ప్రతిష్టలు కావడం వల్ల ఈ దేశానికి ఒన గూరింది ఏమీ లేదు . పైగా ప్రపంచంలో అనేక సందర్భాలలో ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందుతున్న వాళ్లంతా కూడా భారతదేశానికి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రస్తుతం ఇతర దేశాలలో స్థిరపడిన కారణంగా కీర్తి ప్రతిష్టలకు కూడా ఈ దేశం నోచుకోవడం లేదు . ఎప్పుడైనా ప్రజల కష్టార్జితం ద్వారా రైతులు కార్మికులు చేతివృత్తుల చెమట చుక్కల ద్వారా ఉత్పత్తి అయినటువంటి సంపద ఏరకంగా నైతే దేశ ప్రజలందరికీ చెందుతుందో అదే రకంగా ఈ దేశంలో ఎదిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల యొక్క అన్వేషణలు ఈ దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. తద్వారా దోపిడీ, పీడన, అణచివేత, అంతరాలు, అసమానతలు లేని సమ సమాజం ఆవిర్భవించాలి అనేదే ప్రొఫెసర్ సతీష్ ధావన్ యొక్క హెచ్చరికలోని అంతరార్థం. మెజారిటీ ప్రజల కోసమే దేశములో జరిగే అభివృద్ధి అన్వేషణలు ప్రయోగాలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఉపయోగపడాలి కానీ పిడికెడు సంపన్న వర్గాల ప్రయోజనం కోసం కాదు అని అంతర్గతంగా చేసిన హెచ్చరికలు ఇప్పటికైనా పాలకులు గుర్తిస్తే దేశం బాగుపడుతుంది . పాలకుల సమయస్ఫూర్తిని ప్రజలు గుర్తిస్తారు ప్రపంచంలో మన దేశం ఆదరించబడుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )