చోరికి ప్రయత్నం పోలీసుల కు పిర్యాదు

Sep 26, 2024 - 22:28
Sep 27, 2024 - 19:04
 0  2

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ చోరికి ప్రయత్నం పోలీసుల కు పిర్యాదు ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పల్లా వెంకటరెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చొరికియత్నించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్ రెడ్డి ఇంట్లో అతని తో పాటు భార్య మరియు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకోనివచ్చి భార్య కలమ్మ వద్ద కి వచ్చి నీ భర్త వెంకటరెడ్డి తోమాట్లాడాలని బెదిరించినట్లు తెలిపారు.వెంకట్ రెడ్డి నీ లేపి ఇంటి పక్కకు తీసుకవెళ్ళి మాట్లాడుతుండగా వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.దాంతో చుట్టూ పక్కల వారి లేచి రావడం తో భయంతో పారిపోయినట్లు తెలిపారు.ఈ సంఘటన పై సూర్యాపేట సిఐ సురేందర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు.వెంకట్ రెడ్డి భార్య పల్ల కలమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై సైదులు తెలిపారు. *సంఘటన పై పలు అనుమానాలు* తుమ్మల పెంపహాడ్ పల్ల వెంకట్ రెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డ విషయమై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంకట్ రెడ్డి ఇంట్లో చొరబడిన వ్యక్తులు వెంకట్ రెడ్డి కి ఒకరు రివాల్వర్ పెట్టీ బెదిరించారని భార్య కలమ్మ కడుపు వద్ద కత్తి పెట్టినట్లు తెలిసింది. వెంకట్ రెడ్డి పలు రకాల ఫైనాన్స్ వ్యాపారాలు చేసి కొందరిని ఆర్దికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు స్థానికులు ఆరోపించారు. వెంకట్ రెడ్డి వ్యాపారాల తో ఆర్దికంగా స్థిరపడి నమ్మిన వారిని పెట్టుబడి పెట్టిన వారిని వేధింపులకు గురి చేయడం తో బెదిరింపుల పాల్పడి ఉండవచ్చని రివాల్వర్ విషయమై ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో రివాల్వర్ కత్తి ప్రస్తావన లేకపోవడం విశేషం..