వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలి

Sep 26, 2024 - 21:06
 0  17
వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలి
వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలి

రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్ 
భువనగిరి 26 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  యాదాద్రి భువనగిరి డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి శ్రీ శిశు సంక్షేమ శాఖ పిడి నరసింహారావు చేతల మీదుగా  అక్టోబర్ 25.26.27 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల చేయడం జరిగింది.అక్టోబర్ 25.26.27 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఎన్ పి ఆర్ డి 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని వారు ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా డి ఆర్ డి ఎ పిడి . నాగిరెడ్డి మాట్లాడుతూ.. వికలాంగులను చైతన్య పర్చడం కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయమని వారు ఈ సందర్బంగా అన్నారు.అదేవిదంగా  అనంతరం ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని,కేంద్ర ప్రభుత్వం 2011నుండి ఇప్పటివరకు వికలాంగులకు 300 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం వికలాంగుల పట్ల వారికి ఉన్న చిత్త శుద్ధి అర్థమవుతుందని వారు అన్నారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ ను  దేశవ్యాప్తంగా 3వెలు రూపాయలకు పెంచాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.  అక్టోబర్ 25 తారీఖున ఇందిరాపార్క్ వద్ద ఎన్ పిఆర్ డి  రాష్ట్ర బహిరంగ సభకు జిల్లా మండల గ్రామాల నుండి పెద్ద సంఖ్యల హాజరై పాల్గొని  జయప్రదం చేయాలని జిల్లాలోని వికలాంగులను కోరారు.రాష్ట్ర కమిటీ సభ్యులు సురూపంగా ప్రకాష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ముందు వికలాంగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను 6వేలు రూపాయలకు పెంచాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని అమలు చెయ్యాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. అదేవిదంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళ వికలాంగులపై జరుగుతున్న అత్యాచారాలు  అరికట్టి శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత మండల నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333