చేయూత ,ఆసరా ,వికలాంగుల, పెన్షన్ మహాసభను విజయవంతం చేయాలి.... పాతకోట్ల నాగరాజు

ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ
మునగాల 29 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ మాట్లాడుతూ, ఆగస్టు ఒకటో తేదీన హుజూర్నగర్ కేంద్రంలో జరిగే చేయూతపెన్షన్ దారుల జిల్లాసన్నాక సభను విజయవంతం చేయాలని, పిలుపునిచ్చారు.ఈసభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని కావున వితంతువులు ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ దారులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు 4000/_ రూపాయలు వికలాంగులకు 6000/_ రూపాయలు పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 15 వేల రూపాయలు పెన్షన్, పెంచాలని ఆగస్టు 13న హైదరాబాదులో జరిగే వికలాంగుల ఆసరా పింఛన్ మహా గర్జన సభను జయప్రదం చేయుట కొరకే ఆగస్టు 1న హుజూర్నగర్ లో వికలాంగుల చేయూత ఆసరా పెన్షన్ మహాసభ జరుగుతుందని, వారు తెలిపారు. ఈ యొక్క సన్నాక సభను అత్యధిక జనాభా పాల్గొని విజయవంతం చేయాలని
ఈసందర్భంగా కోరారు.