గుజరాత్ పై పోరాడి గెలిచిన పంజాబ్ కింగ్స్ 

Apr 5, 2024 - 16:30
Apr 5, 2024 - 16:30
 0  5
గుజరాత్ పై పోరాడి గెలిచిన పంజాబ్ కింగ్స్ 

అహ్మదాబాద్, ఏప్రిల్ 05 :- గుజరాత్ పై పంజాబ్ థ్రిల్లిం గ్ విజయం సాధించింది. ఒక బాల్ మిగిలి ఉండగానే 200 పరుగుల టార్గెట్ ను చేదించింది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరులో భారీ స్కోర్లు న‌మో దైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్అద్భుత విజ‌యం సాధించింది.

శ‌శాంక్ సింగ్‌(61 నాటౌట్) అస‌మాన పోరాటానికి.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్ తోడ‌వ్వ‌ డంతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేద‌న‌ లో టాపార్డ‌ర్ విఫ‌లమైనా.. మిడిలార్డ‌ర్ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుల్లా పోరాడారు.

శ‌శాంక్, అశుతోష్‌లు సిక్స‌ర్ల‌ తో హోరెత్తించి లక్ష్యాన్ని క‌రిగించారు. దాంతో, గుజ‌ రాత్ అనూహ్యంగా ఓట‌మి పాలైంది.ఆఖ‌రి ఓవ‌ర్ పోరా టాల‌తో ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద‌ర‌గొట్టింది.

గుజ‌రాత్‌ను సొంత మైదా నంలో చిత్తు చేసింది. ద‌ర్శ‌న్ న‌ల్కంద వేసిన 20వ ఓవ‌ర్‌ లో పంజాబ్ విజ‌యానికి 7 ప‌రుగులు కావాలి. తొలి బంతిని లాంగాఫ్‌లో ఆడిన అశుతోష్ ర‌షీద్ చేతికి చి  క్కాడు. ఆ త‌ర్వాత బంతి వైడ్‌. మూడో బంతికి సింగిల్ వ‌చ్చింది.

నాలుగో బంతిని శశాంక్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. రెండు బంతుల‌కు ఒక్క ర‌న్ అవ‌స‌ర‌మైంది. అప్పుడు లెగ్‌బై తీయ‌డంతో పంజాబ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది.భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ 70 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది.

టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు శిఖ‌ర్‌ ధావ‌న్(1), జానీ బెయిర్‌ స్టో(22), ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌(35), సామ్ క‌ర‌న్‌(5) లు విఫ‌ల‌మ‌య్యారు. అయితే అశుతోష్‌, శ‌శాంక్‌ లు సుడిగాలిలా చెల‌రేగి గుజ‌రాత్‌ను ఓడించారు..

అంతకు ముందు సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ శుభ్‌మ‌న్ గిల్(89 నాటౌట్) శివాలెత్తిపోయా డు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అత‌డు పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

గిల్ విధ్వంసానికి సాయి సుద‌ర్శ‌న్‌(33), కేన్ విలియ‌ మ్స‌న్(26), రాహుల్ తెవాటియా(23 నాటౌట్)ల మెరుపులు తోడ‌వ్వ‌డంతో గుజ‌రాత్ వికెట్ల 4 న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333