రైతు వేదికలో నేడు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తాసిల్దార్.

మునగాల 29 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తహసిల్దార్ రామకృష్ణారెడ్డి, మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు, మండలంలో 717 రేషన్ కార్డులు మంజూరైనట్లు వారు తెలిపారు.ఆయా గ్రామాలలో రేషన్ డీలర్లతో నూతన రేషన్ కార్డులు తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారిగా మంజూరైన రేషన్ కార్డుల వివరాలు నేలమర్రి 34, తాడువాయి 37, వెంకట్రాంపురం 10, మాధవరం 41, రేపాల 28, సీతానగరం 16, జగన్నాధపురం 38,విజయ రాఘవపురం 15, నరసింహులగూడెం 53, కలకోవ 37, మునగాల 81,నారాయణ గూడెం 63, గణపవరం 52, కొక్కిరేణి 10, తిమ్మారెడ్డి గూడెం 11, బరాఖాతీగూడెం 90, ఆకు పాముల 33, కోదండరామపురం 13, నరసింహపురం 22, ముకుందాపురం 33, మంజూరైనట్లు మండల తహసిల్దార్ రామకృష్ణారెడ్డి తెలిపారు.