చలో ఓరుగల్లు డీజేఎఫ్ రాష్ట్ర మహాసభ కరపత్ర ఆవిష్కరణ చేసిన ఎస్ఐ నాగరాజు
అడ్డగూడూరు 21 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- జనవరి 24 న జరిగే డి.జే.ఎఫ్ రాష్ట్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు మాసాని కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డి,జె,ఎఫ్)అడ్డగూడూరు మండల అధ్యక్షులు కడియం.రవివర్మ ఆధ్వర్యంలో జనవరి 24న ఓరుగల్లులో జరిగే డీ.జే.ఎఫ్ రాష్ట్ర మహాసభ కరపత్రంను ఎస్సై నాగరాజు ట్రైనింగ్ ఎస్ ఐ రవి,చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ..ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే వాళ్లే జర్నలిజం అని అన్నారు.ప్రభుత్వంచే ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా పని చేసే జర్నలిస్టు అని అన్నారు.ప్రజాహితమే లక్ష్యంగా పనిచేసేవారంతా జర్నలిస్ట్ లేనని.అక్షర యోధులకు చిన్న పెద్ద తారతమ్యం లేదని చాటి చెప్పుతూ జర్నలిస్టుల హక్కుల సాధనే ద్యేయంగా ఏర్పడిన ప్రగతిశీల పాత్రికేయ ఐక్య కూటమే డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డి,జె,ఎఫ్)అని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ పనిచేసే చిన్న,పెద్ద పత్రికలతో పాటు యూట్యూబ్ న్యూస్ ఛానల్ డిజిటల్ వెబ్ మీడియాతో పాటు అన్ని రకాల మీడియాలో పనిచేసే అక్షర సైనికులు అందరికీ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఆశయంతో డీ జే ఎఫ్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల (డి.జే.ఎఫ్)కమిటీ సభ్యులు పనుమటి సైదులు(న్యూస్ ఇండియా)బాలెంల కళ్యాణి దుర్గయ్య(ప్రజా సాక్షి)చింత సుధాకర్(ప్రజా జ్యోతి)బాలెoల పరశురాములు(సత్యనిష్ట) నీర్మాల సందీప్(ప్రజా కలం)నీర్మాల వెంకటేశ్వర్లు(ప్రజా వాయిస్)మందుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.