అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డ్,ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
బిజెపి మండల అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి
మాడుగుల పల్లి. 22 జనవరి 2025 తెలంగాణవార్త విలేఖరి :- అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు అందజేయాలని,అధికార పార్టీ నేతలకు కాకుండా అర్హులైన నిరుపేదలకే అందేటట్టు చూడాలని మాడుగులపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి అన్నారు. అలాగే రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని, కౌలు రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి 12,000 ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు.