నల్లగొండలో జరగబోయే వికలాంగుల హక్కుల పరిరక్షణ

సమితి కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి....... గిద్ద రాజేష్

Oct 23, 2024 - 17:11
Oct 23, 2024 - 17:15
 0  0
నల్లగొండలో జరగబోయే వికలాంగుల హక్కుల పరిరక్షణ

మునగాల 23 అక్టోబర్ 20 24

తెలంగాణ వార్త ప్రతినిధి :- అక్టోబర్ 25. 26. 27 తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంగా జరగనన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర రెండోవ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు బుధవారం మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాని ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హామీలు అమలు చేయాలని నాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను నల్గొండ కేంద్రంగా మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యచరణను రూపొందించడం జరుగుతుందని తొలి రోజు సంఘం జాతీయ గౌరవ అధ్యక్షురాలు పిఎ.సిఎస్ చిలుకూరు మాజీ డైరెక్టర్ గిద్దె భాగ్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపిన ఆయన నల్గొండ జిల్లా ఇంచార్జ్ కుర్ర గోపి యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక మత్స్యగిరి అధ్యక్షతన మూడు రోజులపాటు జరిగే ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో హక్కుల సాధనకై ఉద్యమ కార్యాచరణలను రూపొందించుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను ప్రకటించడం జరుగుతుందని ఈ కార్యవర్గ సమావేశాలకు సంఘం రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లాల ఇన్చార్జిలు అందరూ విధిగా హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదనమోహన్ రెడ్డి బీసీ సంఘం నాయకులు చల్లా బ్రహ్మం మైనార్టీ సెల్ నాయకులు షేక్ ఖాసిం ఎస్టీ సెల్ నాయకురాలు బానోతు సుజాత తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State