గ్రామంలో పడకేసిన పారిశుద్ధం
గ్రామాల వైపు కన్నెత్తి చూడండి ప్రత్యేక అధికారులు
గ్రామానికి పంచాయతీ కార్యదర్శులు వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు
జోగులాంబ గద్వాల 22 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్ మండలం పవనం పల్లి గ్రామంలో రోడ్డుపై ఇలా... ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరంతో మంచం పట్టారు గ్రామాల్లో దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో గ్రామంలో దోమలు స్వైర విహారం చేసి ప్రజలను కాటు వేస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర జ్వరాలతో డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు దావఖానాలుకు పోయి లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్న గ్రామ పంచాయతీ పాలకవర్గ మాత్రం గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టడం లేదు. సైడ్ డ్రైన్లు పూడిక తీయకపోవడంతో మురికి వాసన కంపు కొడుతుంది. దీంతో దోమలు పుట్టగొడుగుల పుట్టుక వస్తున్నాయి. చేసేది లేక గ్రామ ప్రజలు సొంత ఖర్చులతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి ఎవరి వాళ్లే చల్లుకుంటున్నరు. జిల్లాలో చాలా పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు మంచాలు పట్టి జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పాలకవర్గం అటు మండల అభివృద్ధి అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడంతో పాటు ఇటు వైద్య బృందం కూడా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే సొంత ఖర్చుతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి చల్లుకుంటున్నమని వారు ఆవేదనతో తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరిగేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.