చరిత్ర సమ్మతించని ఆధారాలతో రావణ దహనం సభబేనా
విశ్వాసాల పునాదులపై రావణ బొమ్మను దహనం చేయడం మనిషి ఉనికిని ప్రశ్నించడమే. !కొందరి నమ్మకాలు మత విశ్వాసాల కోసం ఆధారాలు లేకుండా కాల్చి కూల్చడం అంటే ప్రజాభిప్రాయాలను అణచివేయడమే *
************************************
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
----02....10....2025*****************
అక్కడేదో పెద్ద జన సందోహం మధ్యన కాల్పుల మోత వినబడింది. ఏమైనా ప్రమాదమా లేక ఎన్కౌంటర్ రా లేక మరేదైనా జరిగిందా? అనేది ప్రజల ఆందోళన... అయితే అదేది లేదు చట్టబద్ధంగా ప్రభుత్వ పర్యవేక్షణలో, ప్రభుత్వ ఆమోదంతో, పోలీసుల రక్షణల మధ్యన, నమ్మిన కొంతమంది ప్రజల బలగాల సాక్షిగా అక్కడ జరిగింది నిజంగా మారన హోమమే. మనిషిని బలి తీసుకోవడమే. మానవ రూపంలో ఉన్న బొమ్మ ను కాల్చి చంపడమే! అయితే ఆ వ్యక్తి చరిత్రలో నిలబడకపోయినా పౌరాణిక గాథలో గొప్ప రారాజుగా వెలుగొందిన వాడు అదే కాలంలో అయోధ్య నగరానికి అంతిమంగా శ్రీరాముడు పరిపాలించిన కాలంలో వీరి మధ్యన జరిగిన యుద్ధం, సీతాపహరణం, సీతను ఎత్తుకు వచ్చినాడనే ఆరోపణ రావణుని పైన పె ను దుమారం రగిలించిన వేళ సీతను ఏమాత్రం కూడా ముట్టక కనీసం బాధించక తన చెల్లె ముక్కు చెవులు కోసినందుకు శ్రీరాముని భార్యను లక్ష్యంగా చేసుకొని బంధించినట్లు మాత్రమే చెప్పబడిందిచరిత్రలో పౌరాణిక గాథలో. చరిత్ర వేరు విశ్వాసాలు వేరు ఆధ్యాత్మిక భావనతో పౌరాణిక ఇతిహాసాలు వేరు వీటికి కొన్ని ఆధారాలు ఉండవచ్చు లేదా ఆధారాలను కల్పించి చట్టబద్ధం చేసే పని కూడా కొనసాగింది. చివరికి ఇదంతా విశ్వాసాల మీద ఆధారపడినటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దబడినప్పటికీ మంచికి ప్రతినిధిగా రామున్ని, చెడుకు ప్రతినిధిగా రావణుని నిర్ధారించడమే ఇక్కడ వివాదానికి కారణమైంది. అయితే వాళ్ల వాళ్ల యొక్క నేరాలు తప్పిదాల కారణంగా జరిగిన యుద్ధంలో ఓటమి పాలు కావడం చనిపోవడం అనే అంశాలు చారిత్రకంగా కొద్దిసేపు ఆలోచిస్తే ఆ కథకు ముగింపు పలకాల్సిందే. కానీ నేటి యుగంలో కూడా ఆ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం, బాంబులతో పేల్చడం, అక్కసు వెళ్ల తీసుకొని కొన్ని వర్గాలు రాముని పక్షాన వకాలత పుచ్చుకున్నట్టుగా వ్యవహ రించడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. రావణుడు లేడు రాముడు లేడు రావణుని బొమ్మను కాల్చితే ఎవరికీ ఏమీ బాధ లేదు కానీ మనోభావాలు దెబ్బ తినే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కనుక మనోభావాలకు భిన్నంగా ఎవరు నడిచినా అది శిక్షార్హమే అవుతుంది.
ఆందోళన కల్గించే చర్చను ఆపివేద్దాం-కలిసి జీవిద్దాం:
****************************** *******-***
రావణుడు సీతను అపహరించినాడనే కారణంతో లంక పైన యుద్ధం చేసి సంహరించడం ఒక ఎత్తు అయితే రావణాసురుని సోదరి సూర్పనక mukku, చెవులు కోసినందుకు లక్షణునికి మరి ఏ శిక్ష వేయాలి? అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ రకంగా ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగానే తన సహోదరి ఆత్మ రక్షణ కోసం ఆత్మాభిమానంతో మాత్రమే సీతను అపరిచినట్లు కొంతమంది పౌరాణిక ఇతిహాసాల పైన ఆలోచించే వాళ్ళ యొక్క అభిప్రాయం. శాస్త్రీయ యుగంలో అను పరిజ్ఞానంతో విశ్వాంతరాల మదించగలుగుతున్నటువంటి ఈ కాలంలో వేల సంవత్సరాలకు పూర్వం జరిగినట్లుగా చెప్పబడుతున్నటువంటి రామాయణ ఇతిహాసం చారిత్రక ఘట్టం. అది ఊహాజనితంగానే మిగిలిపోవడం విచారకరమైతే అందులో కూడా మనిషిని సాటి మనిషిగా చూడకుండా వివక్షతకు గురి చేయడం,చెడును ఆపాదించి నేరాన్ని మోపి భారీ శిక్షవేయడం ఒకరకంగా మెజార్టీ ప్రజల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీయటమే. ఇటీవల కాలంలో గనక గమనించినప్పుడు అనేక పెద్దపెద్ద నేరాలు హత్యలు, అత్యాచారాలు చేసినటువంటి వాళ్లకు కూడా పదుల సంవత్సరాల పాటు న్యాయ విచారణ పేరుతో కాలయాపన జరుగుతున్నదే కానీ శిక్షలు పడడం లేదు. అందులో కూడా డబ్బున్నటువంటి వాళ్లకు రాజకీయ నాయకులకు ఎన్నో మినహాయింపులు ఉన్నాయి ఇదంతా ఈనాడు రాజకీయ రణక్షేత్రంలో జరుగుతున్న రచ్చ మనందరికీ తెలిసినదే. "నేటి యువత ఈనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలు అవినీతి, అక్రమాలు, దోపిడి పీడ న, అనుచనేత,వివక్షతలపైన పోరాటం చేయవలసినది పోయి చరిత్రకు అందని చారిత్రక ఆనవాళ్లు లేని ఒక విశ్వాసాన్ని బలంగా పట్టుకొని వ్యక్తిని బొమ్మగా చేసి బాంబులు పెట్టి కాల్చి అక్కసు వెళ్ళ తీసుకుంటున్నారు అంటే క్రూరత్వం నేటి మనిషిలో దాగి ఉన్నట్లే కదా!" అలాంటప్పుడు నేటి సమాజంలో ప్రశాంతత ఏ రకంగా సాధ్యమవుతుంది? ""ఇప్పటికీ నేటి సమాజంలో మధ్యము, మత్తుపదార్థాలు, ధూమపానము, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, రకరకాల దోపిడీ పద్ధతులకు యువత పాల్పడడం ద్వారా చారిత్రక సామాజిక శాస్త్రీయ రాజకీయ పరిజ్ఞానానికి దూరంగా లక్షలాదిమంది యువత నెట్టివేయబడుతున్నారు. అంద విశ్వాసాల పునాదిపైన తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు ఈ విశ్వాసాలకు తల్లిదండ్రులు సహకరించడం కానీ లేక తమ పిల్లలను కట్టడి చేయడం కానీ లేని కారణంగా అబూత కల్పనలు వాస్తవాలై, వాస్తవాలు అబూత కల్పనగా మారిపోతూ అనవసరంగా ఈ సమాజాన్ని రెండుగా చీల్చి వేయడం జరుగుతున్నది ఇది అమానవీయమైనటువంటి దురాలోచన. """ ఈ దురాలోచనకు వెంటనే స్వస్తిపలకా ల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ అంశం పైన చాలా చోట్ల బాంబులతో కాల్చడం అనేది చట్ట విరుద్ధమని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినప్పటికీ, అక్కడక్కడ న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసినప్పటికీ, ప్రభుత్వ పెద్దలకు ఇది సరైనది కాదని సమాచారం ఇచ్చినప్పటికీ ఈ కార్యక్రమాలలో మంత్రులు అధికారులు, శాసనసభ్యులు ఇతర ప్రజా నాయకులు పాల్గొనడం కూడా కొంత ఆక్షేపనియం కాదా !
పరిష్కారం ఏమిటి?
**********************
" తోటి మనిషిని సాటి మనిషిగా గౌరవించవలసినటువంటి ఈ మానవీయ సమాజంలో అమానవీయ సంఘటనలకు స్థానం లేదు. చరిత్ర కందని అంశాల పైన పెద్దగా పట్టింపుతో ప్రజలను నిలువునా చీల్చే ఇలాంటి దుందుడుకు కార్యక్రమాలను ప్రభుత్వం కట్టడి చేయాలి ఉక్కు పాదం మోపాల్సిన అవసరం కూడా చట్టం పైన ఉన్నది. ఇలాగే కొనసాగినట్లయితే రావణుని కాల్చినట్లుగా రాముని విగ్రహాన్ని కూడా తయారుచేసి ఇదే మాదిరిగా మరికొంతమంది కాల్చడానికి కూల్చడానికి గనక ప్రయత్నం చేస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? ఇది మారణ హోమానికి దారి తీయదా? ఈ అమానవీయ సంఘటనలకు ఆజ్యం కోసే బదులు ఎక్కడో ఒకచోట నిలువరించవలసిన అవసరం ఉన్నది. పోలీసులు, అధికారులు,న్యాయ వ్యవస్థ, ప్రభుత్వము ఈ దురాలోచన పైన ఊహాజనిత విశ్వాసాల పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. లేకుంటే రాబోయే కాలంలో ఆందోళనకరమైన పరిస్థితులు తలెత్తితే ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉంటుంది కదా! అది సమంజసమా? అవసరమా? అని న్యాయ ని పు నులు మేధావులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దయచేసి ఈ రుగ్మతను ఇంతటితో ఆపడం వల్ల 140 కోట్లు గా ఉన్నటువంటి భారతీయులమైన మనమంతా ఐక్యంగా కలిసి ఉండడానికి, అభివృద్ధి పథంలో ఈ దేశాన్ని పయనింప చేయడానికి, సర్వశక్తులు ధారబోయడానికి, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించడం ద్వారా ప్రపంచంలోనే భారతదేశం ఉన్నతమైన దేశంగా వి లసిల్లడానికి అవకాశం ఉంటుంది.ఆ వైపుగా పయనిద్దామని మనసారా కోరుతూ""
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసము రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )