ప్రకృతికి ప్రతిరూపం,ఓర్పు,నేర్పు, సహనానికి ప్రతీక స్త్రీలు
మనిషి తన దాహానికి ప్రకృతిని విచ్ఛిన్నం చేసినట్లు స్త్రీ ఓర్పు నశించడానికి సమాజంలోని భిన్న వర్గాలే కారణం. అయినా సమాజము లయ తప్పకుండా ఉండడానికి స్త్రీల ఓర్పు నేర్పు మూలం.*
****************************************
--- వడ్డేపల్లి మల్లేశం 901422064 12
----12....03....2025********************
ప్రతి అంశానికి భిన్న పార్శ్వాలు ఉన్నట్లు సమాజంలోని స్త్రీ పురుష సంబంధాలు, మానవీయ కోణం, అసమానతలు, అంతరాలు,వివక్షత, తోటి మనిషిని సాటి మనిషిగా చూడకుండా వెలివేయడం, లొంగదీసుకోవడం వంటి అంశాలకు భిన్నమైన కారణాలు ఉన్నట్లు ఒక్కొక్కసారి రెండు వైపులా కూడా కారణాలు ఉన్న కారణంగానే సమస్య ఉత్పన్నం కావడమే కాదు ప్రళయం సృష్టించబడుతున్నట్లు విజ్ఞలు అభిప్రాయపడుతున్నారు. అయితే శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు, కార్య కారణ సంబంధం రీత్యా పరిశీలించినప్పుడు, సమ యోచితంగా గమనించి చినప్పుడు స్పష్టత మనకు కనబడుతుంది. పునాదిని మూలాన్ని గ్రహించకుండా పై పైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది .అయితే ఆయా వర్గాలు ఈ వ్యవస్థ కోసం చేసిన కృషి సేవ పట్టుదలతో రాణించిన తీరును కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా కొన్ని సందర్భాలలో కొంత అదనంగా సేవ చేసినట్లు వ్యవస్థ కోసం పనిచేసినట్లు నిర్బంధాలు అణచివేతను మోసినట్లు అయినా భూదేవికి ఉన్నంత ఓర్పుతో వ్యవహరించినట్లుగా మనం గమనించవలసిన అవసరం ఉంటుంది .ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొనడం ద్వారా మాత్రమే వాస్తవాన్ని పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. పైపైన ఆలోచిస్తే, వన్ సైడ్ విచారిస్తే, స్వార్థపూరితంగా లొంగిపోతే, తప్పులు ఒప్పులుగా ఒప్పులు తప్పులు గా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని అనుభవాలు, సంఘటనలు, ఉదంతాల ఆధారంగా స్త్రీల పురుషుల యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం జరుగుతున్నది. కానీ అందుకు గల కారణాలు పూర్వ నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కథా రచయితలు, వ్యాసకర్తలు, నవలా రచయితలు తమ రచనలలో సమాజము లోని కొన్ని లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలని అంతిమంగా ప్రజలు స్నేహ సౌహార్ద్ర సౌబ్రాతృత్వముతో మన గలిగినప్పుడే సమాజం ప్రశాంతంగా కొనసాగుతుందని అంతిమ లక్ష్యం శాంతియే నని చేసిన సూచన అందరం గుర్తించవలసిన అవసరం ఉన్నది.
వ్యవస్థను విచ్చిన్నం చేయడం మానుకోవాలి
*************************************
భూమిని, భూసారాన్ని, భూగర్భ జలాలను మానవుడు విచ్చలవిడిగా వాడుకుంటూ ప్రకృతికి ద్రోహం చేస్తున్నాడు. వన్యప్రాణులను పశుపక్షాదులను సమతూకంగా ఉంచవలసిన బదులు తన స్వార్థానికి వాడుకొని స్వప్రయోజనాలకు పాల్పడుతున్న మనిషి ఎంతసేపు తన స్వార్థానికి మాత్రమే ఒడిగట్టడం అభ్యంతరకరం. అనేక పోషకాలు, ఖ నిజలవనాలతో పోషక విలువలు కలిగి పంటలు భారీగా పండడానికి దొహదం చేస్తున్నటువంటి భూములు కృత్రిమ ఎరువులు రసాయన పురుగు మందులు ఇతర ప్రకృతికి హాని చేసే విష పదార్థాల యొక్క వినియోగం కారణంగా
భూగర్భ జలాలు ఎండిపోవడంతో పాటు సముద్రాలు నదులు నీటి వనరుల లోని జలచరాలన్నీ కూడా మృత్యువాత పడడాన్ని మనం గమనించవచ్చు. ఇదంతా మనిషి తన స్వప్రయోజనం కోసం తెలిసి ప్రకృతికి చేస్తున్న ద్రోహం. తన వినియోగంలో భాగంగా కర్బన పదార్థాలను గాలిలో మండించడం ద్వారా విషపూరితమైనటువంటి వాయువులు ఉత్పన్నమై వాతావరణం మరింత వేడెక్కడానికి తద్వారా అతి వేడి మీ కారణంగా వృద్ధులు మృత్యువాత పడడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాదు విపరీతమైన వేడిమి కారణంగా నది జలాల ప్రవాహాలు వేగం పెరిగి నదులు ఉప్పొంగడం, నీ టి మట్టాలు పెరగడం, సముద్రాలు ఉప్పొంగడం వంటి దురవస్త దాపురిస్తున్నది. ఈ అన్ని పరిణామాలకు కూడా మానవ తప్పుడు దో రనులే ప్రధాన కారణం.అలాగే మానవ సమాజాన్ని బ్రష్టు పట్టించకుండా సజావుగా సాగించడానికి తోడ్పడుతున్నటువంటి స్త్రీ పురుష వ్యవస్థలో స్త్రీలను బలి పశువులను చేయడం ఇటీవలి కాలంలో కొంతమంది పైన ఆకృత్యాలు అత్యాచారాలతో పాటు అమానవీయ పరిస్థితుల్లో దాడులకు పాల్పడిన విషయాన్ని గమనించినప్పుడు మగ జాతి తమ తప్పుడు విధానాలకు క్షమాపణ చెప్పాలి. తలవంచి సాదరంగా స్త్రీ జాతిని గౌరవించాల్సిన అవసరం కూడా ఉన్నది. కొద్దిమంది తప్పుడు విధానాలకు మొత్తం మానవ జాతినే బలి పశువులుగా మార్చడం అవి వేకం కూడా. చర్చించుకుని సంప్రదించుకోవడం ద్వారా తమ లొసుగులు, లోపాలు,వాస్తవాలను సమీకరించుకొని ప్రస్తావించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు.కానీ ఇటీవలి కాలంలో స్త్రీలపై జరిగిన అనేక అత్యాచారాలు అమానవీయ పరిస్థితుల్లో కొనసాగితే వాటి పేరున ప్రత్యేకంగా చట్టాల రూపకల్పన జరిగినాయి అంటే మగ జాతి అహంకారాన్ని మూర్ఖత్వాన్ని ఖండించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రకృతిని, స్త్రీని పరిరక్షించుకుందాం
******----------***-*------------*******------
ప్రకృతిని స్త్రీని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత మనిషి మనుగడకు ఏ రకంగా ప్రకృతి దోహదం చేస్తుందో సమాజం మనగడకు ఆధార భూతమైనటువంటి స్థాయిలో స్త్రీ నిలబడినది అంటే అతిషయోక్తి కాదు. వ్యక్తిగతమైనటువంటి తప్పులు నేరాలు కారణంగా ఒక జాతిని నిందించడానికి వీలు లేదని కొంతమంది ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో మన అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రకృతిని రక్షించుకుందాం..... ప్రకృతిలోని వనరులను భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక అవి దూర్వినియోగం కాకుండా చూసుకోవడం కూడా అవసరం. సమాజ మనుగడకు, అభివృద్ధికి ప్రధాన భూమిక పోషిస్తున్న స్త్రీ జాతిని కూడా పదిల పరచుకోవడం,పరిరక్షించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం. అదే క్రమంలో మానవీయ కోణంలో ఆలోచించడం ద్వారా తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని సమాజం నిండా వ్యాపింప చేయగలిగితే, ఆటుపోట్లను కాదని, అసహనాన్ని వదలి, సహన సంస్కృతిని పెంపొందించుకోగలిగితే మానవుడే మహనీయుడు అన్న చందంగా మనిషి జన్మ సార్థకం అవుతుంది. అ మానవీయ ఆలోచనలు, ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మన లోపాలను పొరపాట్లను సవరించుకోవడం ద్వారా మనిషిని మనిషిగా చూడగలిగే మహోన్నత శక్తిని ఇనుమడింప చేద్దాం. మన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆచరణ సాధ్యమైనటువంటి జీవన విధానంలోనే మానవతా ధోరణి నిబిడీ క్రితమై ఉన్నది అని తెలుసుకుంటే అంతా సవ్యంగానే సాగిపోతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )