రచయితలు కార్టూనిస్టులు ప్రజల మద్దతుదారులు అనడం100% నిజం.
ప్రజలకు పనిచేయడం వారి సామాజిక బాధ్యత కూడా.* నడుస్తున్న చరిత్రను వ్యంగ్యంగా మలి చి ప్రజా గొంతుకగా పనిచేసిన కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గారు సామాజిక చరిత్రకారుడే
*******************************-*****----
---- వడ్డేపల్లి మల్లేశం 90142 06412
------06--07---2025**********************
రచయితలు,సామాజికవేత్తలు, చరిత్రకారులు, కార్టూనిస్టులు, మేధావులు, విశ్లేషకులు, ఉపాధ్యాయులు,సంఘ సేవకులు ప్రజల మేలు కోసం సామాజిక మనుగడ కోసం మరింత ఉత్తమమైన సమాజం కోసం అంతిమంగా సమసమాజ స్థాపన కోసం పనిచేస్తారు అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఆయా రంగాలకు చెందిన వాళ్లు తమ సామాజిక బాధ్యతను విస్మరించినట్లయితే వ్యవస్థకు తన పదవికి అంతిమంగా మానవ జన్మకి ద్రోహం చేసినట్లుగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే స్వార్థ స్వప్రయోజనం, గుండాయిజం, రౌడీయిజం, రాక్షస రాజ్యం,అత్యాచారాల పర్వం, దోపిడీ పీడన, వంచన, ఆధిపత్యం,అహంభావం వంటి అనేక అవలక్షణాల కారణంగా సమాజం ఇప్పటికీ చాలా బ్రష్టు పట్టిపోయింది. ఈ సమాజాన్ని బాగు చేయడానికి రచయితలు కవులు మేధావులు విశ్లేషకులు సామాజిక కార్యకర్తలు కూడా ఎవరి దారిన వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వ్యవస్థ బాగు కోసం ఉమ్మడిగా కూడా ఆరాటపడుతున్నారు. ఆ ఆరాటం లేకుండా కేవలం నటనతో జీవించేవాళ్లు ఈ దేశానికి ద్రోహం తలపెట్టే వాళ్ళు. "అదే సందర్భంలో పాలకులు కూడా ప్రజల కంటే మిన్నగా తమ స్వప్రయోజనాలను, అధికార దాహాన్ని, వర్గ ప్రయోజనాన్ని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కారణంగా కూడా రాజకీయ సామాజిక చారిత్రక రంగాలలో ఏర్పడుతున్నటువంటి లోపాన్ని సవరించడం కూడా మేధావులకు బుద్ధి జీవులకు అదనపు బాధ్యతగా మారిపోతున్నది. " ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరిచి నిద్రపోకుమా" అని ఒక వైపు ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తే ఆ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలను నిరంతరం జాగరూ కులను చేయడానికి ప్రభావితం చేయడానికి మేధావులు, రచయితలు, విప్లవ రచయితలు, సంఘసంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు తమ భుజానికి వేసుకొని బాధ్యతను మరింతగా మో స్తున్న విషయాన్ని మనం గమనించాలి. అదే కోవలోకి కార్టూనిస్టులు రచయితలు కూడా వస్తారు అని తెలుసుకోవాలి.
రాజకీయ నాయకులకు నే ను ఎంతో రుణపడి ఉన్నా:
****************************************
ప్రముఖ కార్టూనిస్టు విశ్లేషకుడు నడుస్తున్న చరిత్రను నిరంతరం గతి తప్పకుండా సంస్కరించడానికి తన జీవితమంతా తోడ్పడినటువంటి కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ గారు ""రాజకీయ నాయకులకు నేనెంతో రుణపడి ఉన్నాను. వాళ్లు దేశాన్ని పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకున్నారు నా కార్టూన్లకు కావలసిన సరుకు ఇచ్చి ప్రజల మధ్యన నేను జీవించడానికి తోడ్పడ్డారు. రాజకీయ నాయకులు గనుక మంచి వాళ్ళు అయితే నీతి నియమావళితో కట్టుబడి ఉండి సుపరిపాలన గనక చేస్తే నా ఉద్యోగం ఊఁ డిపోయేది ఉద్యోగం మానేయవలసి వచ్చేది"" అని తాను నిర్వహించిన పాత్రను వ్యంగ్యంగా చెప్పడాన్ని గమనించినప్పుడు కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గారు నిర్వహించిన సామాజిక బాధ్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ""సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక పరిస్థితుల పైన అవగాహనతో వాటిని ప్రభావితం చేయడం ద్వారా సుపరిపాలన అందించవలసినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామిక దేశంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూడకుండా పెట్టుబడి దారి సామ్రాజ్య విధానాలకు తొత్తులుగా వ్యవహరించి సామాన్యుడిని బలి పశువులను చేశాయని అందుకే సామాన్యుని పక్షాన తన జీవితమంతా పనిచేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో 50 సంవత్సరాల తో పాటు ఇతర పత్రికలలో అనేక సంవత్సరాల పాటు కార్టూనిస్ట్ గా పనిచేసి సామాజిక అంశాలను ఎత్తిచూపి రాజకీయ పార్టీల నాయకులకు కనువిప్పు కలిగించిన దార్శనికు నిగా మనం ఆర్కే లక్ష్మణ్ గారిని గుర్తించవలసిన అవసరం ఉంది. "" "రాజు చేతి కత్తిరక్తంబు వర్షించు సుక వి చేతి కలము సుధలు కురియు, అతడేల గల్గు యావత్ ప్రపంచంబు ఈతడేలగలుగు ఇహము పరము" అని జాషువా గారు అన్నట్లు ఒక రచయిత ఒక మేధావి ఒక ప్రజా కోణంలో ఆలోచించగలిగినటువంటి నిపుణుడు పదునైన కలము ద్వారా కత్తి కంటి మిన్న అయినటువంటి సామాజిక మార్పును సాధించగలరని చెప్పడానికి జాషువా గారు వర్ణించిన ప్రకారంగా ప్రజా క్షేత్రంలో పనిచేసిన వారిగా ఆర్కే లక్ష్మణ్ గారిని మనం గుర్తించడం కనీసమైన బాధ్యత.
ఆర్కే లక్ష్మణ్ గారి గురించి కొన్ని అంశాలు
*********************************
వ్యక్తిగత చరిత్ర కాకుండా సామాజిక మార్పు కోసం ఏ రకంగా దోహదపడినాడో తెలుసుకోవడం కోసం వారి గురించిన సంక్షిప్త పరిచయాన్ని మీ ముందు ఉంచడం సందర్పోస్తామని భావిస్తున్నాను. సగటు మనిషి కేంద్రంగా తన ఆలోచనలను సమాజం ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా వ్యంగ్య చిత్రాలను గీసి పత్రికతో పాటు ప్రజలు పాఠకులు పాలకులను కూడా ఆలోచింపచేసినటువంటి ఘనత వీరి కుందని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ""రాజకీయాలు గతి తప్పి నాయి కనుకనే తనకు కొంత పని దొరికిందని, సుపరిపాలన రాజకీయాలు స్వచ్ఛమైనవిగా కొనసాగినట్లయితే తాను వ్యంగ్య రచనలు గీయడానికి కార్టూన్లు వేయడానికి అవకాశం దొరికేది కాదని, కానీ భారతదేశంలో స్వాతంత్ర అనంతరం పాలకుల యొక్క ఎత్తుగడలు దోపిడీ, పీడన అణిచివేత ఒ o టేద్దు పోకడ, పెట్టుబడి దారి విధానానికి వంత పాడడం వంటి అనేక అవలక్షణాల వల్ల తనకు సామాన్యుల పట్ల వివరించడానికి అవకాశం దొరికిందని, అంటే పరోక్షంగా రాజకీయ నాయకులు పార్టీలు ప్రభుత్వాలే తనకు కావలసిన సరుకులు ఇచ్చినట్లుగా"" ఆయన భావిస్తున్నాడంటే ఈ దేశంలోని పాలనలోని డొల్లతనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది కేవలం వర్ణించడం కోసం మాత్రం కాదు, విమర్శ అనేది మార్పు కోసం, విమర్శ సైద్ధాంతిక పరమైన చర్చ కోసం, తద్వారా సామాజిక మార్పులతో పాటు సజీవమైన ఆలోచనలను మేలవించడానికి, పరిపాలనలో తీసుకురావలసిన మార్పులను అమలు చేయడానికి తోడ్పడడమే రచనలు సాహిత్యము వ్యంగ రచనల యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నిబ్బరంగా, నిర్భయంగా సుమారు 50 సంవత్సరాలకు పైగా నిర్వహించి పత్రికల ద్వారా ప్రజలకు, ప్రపంచానికి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించినటువంటి ఆర్కే లక్ష్మణ్ గారు నిజంగా అభినందనీయులు.
తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నటువంటి రచయితలు కవులు కళాకారులు మేధావులు కార్టూనిస్టులు ఆర్కే లక్ష్మణ్ గారి సుదీర్ఘమైనటువంటి కృషిని దృష్టిలో ఉంచుకొని తమ సామాజిక బాధ్యతను గుర్తించడానికి ఉద్యుక్తులు కావలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక మేధావి సమాజంలో మార్పు తీసుకురావడానికి తోడ్పడతాడని కేవలం నినాదం ఇస్తే సరిపోదు తన జీవిత కాలంలో ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో సా కారం చేసుకోవడం కూడా చాలా అవసరం. అందుకే ఆర్కే లక్ష్మణ్ గారు"" రాజకీయ నాయకులకు నేనెంతో రుణపడి ఉన్నాను. వాళ్లు దేశాన్ని పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకున్నారు. నా మాటలకు కొంతవరకైనా స్పందించినారు. మార్పు కోరే ప్రతినిధులుగా కొంతవరకు స్పందించిన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. "" అని తెలుపుతున్నాడంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు గుణపాఠం రావాల్సిన అవసరం ఎంతో ఉన్నదని అర్థం.
కామన్ మ్యాన్ ను దృష్టిలో ఉంచుకొని చేసిన వారి రచనలు ప్రధాన పాత్ర పోషిస్తుంటే, ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో క్రియాశీలక పాత్ర పోషించడాన్ని మనమందరం అభినందించాలి .కేవలం రచనతోనే వదిలిపెట్టకుండా సామాన్యుల గొంతుకగా వారి సమస్యల పరిష్కారంలో తన బాధ్యతగా స్వీకరించి పాలకులకు దడ పుట్టించినటువంటి కార్టూనిస్టుగా, ప్రజాప్రతినిధిగా వారు భారత దేశంలో సుపరిచితుడు. ఆర్కే లక్ష్మణ్ గారి లాగా ప్రతి వ్యక్తి తనకంటూ ఒక రంగాన్ని నిర్మాణం చేసుకొని సామాజిక బాధ్యతను నిర్వహించడం ద్వారా ఎంతో కొంత మార్పు కోసం కృషి చేయడానికి సిద్ధపడాలి. ఆ రకంగా కాకుండా తన వరకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తుల గురించి ఈ వ్యవస్థ పట్టించుకోదు వాళ్ల అవసరం ఈ వ్యవస్థకు కూడా లేదు అని కఠినంగా చెప్పగలిగితే కనువిప్పు కలిగేలా మాట్లాడగలిగితేనే భవిష్యత్తులో లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రజలను జాగ్రత్తపరచడానికి తద్వారా మెరుగైనటువంటి సమాజాన్ని, పాలకులను సా కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారు అన్నట్లు" ""సమాజ హితం కోరనటువంటి పాలకులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రజలు తమకిష్టమైనటువంటి పాలనను తెచ్చుకునే క్రమంలోపల ఉన్న వ్యవస్థను చిదిమి వేస్తారు. ""అని చేసిన హెచ్చరిక ఇప్పటికీ ప్రభుత్వాలకు గుణపాఠం అయితే మంచిదే.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )