శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.. హౌసింగ్ ఏఈ గోపిసింగ్

Nov 19, 2025 - 19:28
 0  40
శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.. హౌసింగ్ ఏఈ గోపిసింగ్
శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.. హౌసింగ్ ఏఈ గోపిసింగ్

  అడ్డగూడూరు 19 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఆసరుగా నిలుస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మండలంలోని శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎంపికైన లబ్ధిదారులు ముమ్మరంగా చేపడుతున్నారు.ఈ ఏడాది ఆగస్టులో లబ్ధిదారులు ముగ్గులు పోసుకొని నిర్మాణాలు పిల్లర్లు ఏర్పాటు చేసుకొని బేస్మెంట్ వరకు లెవెల్ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతూ.స్లాబ్ లేవల్ వరకు వచ్చాయి.కొందరు లబ్ధిదారులు స్లాబులు వేసుకున్నారు.పైలెట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్న గ్రామం..మానాయకుంట గ్రామంలో బోడ చంద్రయ్య ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేశారని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని హౌసింగ్ ఏఈ గోపిసింగ్ తెలిపారు. మండలంలోని 17గ్రామ పంచాయతీలో 275 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.మొదలు కానివి 44 వీటిలో మార్కౌట్ అయినవి 231 బేస్మెంట్ లెవెల్ 215 రూప్ లేవల్ 142 రూఫ్ కాస్ట్ లెవెల్ రూప్ 97 కంప్లీట్ అయినవి 1 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 95% బిల్లులు పూర్తయ్యాయని హౌసింగ్ ఏఈ గోపిసింగ్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంత తొందరగా పూర్తి చేస్తారో అంత త్వరగా బిల్లులు వస్తాయని హౌసింగ్ ఏఈ తెలిపారు.హౌసింగ్ ఏఈ గ్రామాలలో పర్యటిస్తూ.. ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. హౌసింగ్ ఏఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉండి ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఫోన్ చేస్తే సమాచారం అందిస్తూ విధి నిర్వర్ణను బాధ్యతగా నిర్వహిస్తూ.. లబ్ధిదారుల ఇంటి సమస్యలను పరిష్కరించే దిశగా చేస్తున్నానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333