ఘోర రోడ్డు ప్రమాదం లారీ- బస్సు ఢీ 8 మంది మృతి మరో 25 మందికి గాయాలు

* బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
* చిత్తూరు వైపు నుంచి వస్తున్న అలిపిరి డిపో ఆర్టీసీ బస్సు, ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
* గాయపడ్డ వారిని బంగారుపాళ్యం, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
* ఐరన్ లోడుతో వస్తున్న లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, దాంతో రోడ్డుకు అడ్డదిడ్డంగా వస్తున్న ఆ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
* జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలాన్ని చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.