ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
తిరుమలగిరి 13 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యాడ్ దగ్గర జనవరి 12 సోమవారం రోజున స్వామి వివేకానందుని 164 వ జయంతి వేడుకలు జయహో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల జయహో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అంబటి మహేష్ ఉపాధ్యక్షులు చిలుకల ప్రకాష్ యాదవ్ జయహో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిలకత్తుల శీను స్వామి వివేకానందునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు మనమందరము ఒక మహానుభావుని జయంతిని జరుపుకుంటున్నాం స్వామి వివేకానందుడు భారత దేశానికి మార్గదర్శకం ఆధ్యాత్మిక శారీరకంగా మానసికంగా నైతికంగా బలమైన యువత తోనే బలమైన భారతదేశాన్ని నిర్మించవచ్చని బలంగా నమ్మారు అందుకే ఆయన పుట్టిన రోజు జాతీయ యువజన దినోత్సవం గా మన దేశం జరుపుకుంటుందని ఈరోజు మనమందరం స్వామి వివేక నంద ఆశయాలను మన జీవితంలో ఆచరణలో పెట్టాలని దృఢంగా నిర్ణయించుకుందాం అని మాట్లాడారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి రాష్ట్ర సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య సిపిఎం సీనియర్ నాయకులు కడెం లింగయ్య మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ తిరుమలగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంబాబు రజక సంఘం అధ్యక్షులు పులిమామిడి సోమన్న బ్ఖాసిం వంగరి బ్రహ్మం వడ్డెర వెంకన్న వాటం బాలరాజు తదితరులు పాల్గొన్నారు...