ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
నేరేడుచర్ల 10 మార్చి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
ఆదివారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నేరేడుచర్ల మండల మరియు పట్టణ ఎమ్మార్పీఎస్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే. స్త్రీల కు, దళితులకు చదువు, నిషేధించబడ్డ రోజుల్లోనే భారతదేశంలో మహిళలకు మొట్ట మొదటి పాఠశాలను స్థాపించారు. ఇది జీర్ణించుకోలేని కొన్ని కుల వ్యవస్థలు ఆమెపై అనేక దాడులు చేసింది. స్కూల్లకు వెళ్ళ కుండా ఆమెపై బురద, పేడ నీళ్లు చల్లేవారు.అయినా వారు భయ పడకుండా తనవెంట మరో చీర తీసుకెళ్లేవారు. చివరకు మనసులే మారటం మొదలు పెట్టారు.స్త్రీలకు వివక్ష నుంచి, దళితులకు అంట రానితనం నుండి, వితం తూవులకు దురాచారాల సంఖ్యల్ల నుంచి విముక్తి కావాలి అని, విముక్తి ద్వారా..జ్ఞానం ,జ్ఞానం నుండి..చదువు , వస్తుందిఅని చెప్పేవారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యడవల్లి అరుణ్ మాదిగ, సీనియర్ నాయకులు రాపోలు వెంకన్న మాదిగ, నన్నెపంగా శ్రీను మాదిగ, మచ్చ రాకేష్ కార్తీక్, పాల్గొనడం జరిగింది.