మునగాల మండలం పరిది లోని బరాఖత్ గూడెం గ్రామం లో నేత్రదానం
మునగాల 10 మార్చి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
తాము మరణించిన అవయవదానంతో మరొకరి శరీరంలో జీవిస్తామంటూ అనేక మంది నేత్ర, అవయవదానంతో మరి కొందరి జీవితాల్లో వెలుగులు ప్రసాధిస్తామని చిన్నపిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ముందస్తుగానే అవయవ దానానికి హామీ ఇస్తున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ సమజాహితం కోరి మరణించిన తమవారి అవయవాలను దానం చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అదే కోవలో మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన పొలిశెట్టి రాజ్యలక్ష్మి (84) ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా వారి కుమారులు తమ తల్లి మరణించినా గాని తమ తల్లి అవయవాలు మరో నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఖమ్మం నేత్రనిధి వారికి నేత్రాలను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పలువురు గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పోలిశెట్టి నాగేశ్వరరావు,యాదగిరి, గ్రామ పెద్దలు ఏనుగుల నాగేశ్వరరావు, ఓరుగంటి రవి, జయప్రకాష్, వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.