కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడానికి బి ఆర్ ఎస్ విద్రోహ పాలనే కారణ

Mar 11, 2024 - 13:23
 0  2

ఉద్యమకారులు, మేధావులు కూడా  తొందర పెడుతున్నారంటే  పదేళ్లలో ఉద్యమ ఆకాంక్షలు  నెరవేరకపోవడమే  అసలు కిటుకు.*  కొత్త పాలన నిత్య నూతనంగా  కొనసాగాలంటే  వినూత్న పద్ధతిలో  ప్రజలను కలుపుకుపోవడమే  కీలకం .*
************
-- వడ్డేపల్లి మల్లేశం
పదేళ్ల కాలం పాటు  తెలంగాణ ఆకాంక్షలకు భిన్నంగా    ఆర్థిక వ్యవస్థను కూలదోచి  పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ  తెలంగాణ సెంటిమెంట్ కారణంగా  ప్రజల అభిమానాన్ని  చూరగొని  ఉద్యమ పార్టీ అని భావించి  ప్రజలే  మిగతా రాజకీయ పార్టీలను పక్కనపెట్టి అధికారాన్ని కట్టబెట్టడం  వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించకపోతే  రాష్ట్రంలో  ఏర్పడిన కొత్త ప్రభుత్వం ద్వారా  నూతన విలువలను  మార్పులను ఆశించలేము . సుమారు నాలుగు సంవత్సరాల పాటు  ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు ఉద్యమకారులు కూడా  వెసులుబాటు ఇచ్చి  లక్ష్యాలను సాధించడానికి  సర్దుబాటు కావడం కోసం
  అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.  కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన  నాలుగు రోజులకే  అదే పార్టీ ప్రతిపక్ష స్థాయిలో  ప్రభుత్వం పైన విరుచుకు పడడం అంటే  ఎంత అసంబద్ధమో  అందరం అర్థం చేసుకోవాలి.  ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్షలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడానికి కృషి చేయవలసినదే. కానీ  గత ప్రభుత్వం   ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా, అనేక రకాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అసమానతలు అంతరాలను పెంచి పోషించి, ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని రెచ్చగొట్టిన తీరు గమనిస్తే  ఏ అర్హతతో కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నదో  మనం కూడా టిఆర్ఎస్ పార్టీని నిలదీయవలసిన అవసరం చాలా ఉన్నది.  ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా    ప్రజల అసంతృప్తి వల్ల వచ్చిన కొత్త ప్రభుత్వానికి  మద్దతు ఇవ్వడం ద్వారా  ఏ రంగాలలో మార్పును ఆశిస్తున్నామో స్పష్టంగా సంకేతాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో   అవినీతి  అక్రమార్జ నలో మునిగిన  టిఆర్ఎస్ పాలకులపై  న్యాయ విచారణకు మనమంతా డిమాండ్ చేయాలి.
     పదేళ్లలో సాధించనటువంటి అనేక అంశాలను  రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన కొద్ది రోజులకే  బి ఆర్ ఎస్ డిమాండ్ చేయడం, ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు  కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడంతో  తొలి నాళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాము చేసే ప్రయత్నం కుట్ర జరుగుతున్నది. ప్రాతినిధ్యాలు హెచ్చరికలు, ధర్నాలు పోరాటాలు వివిధ రూపాల ద్వారా ప్రభుత్వంతో పని థీ సుకోవడం ప్రజల యొక్క హక్కు దానిని ఎవరూ కాగలలేరు. కానీ  రాష్ట్రాన్ని అప్పుల  కుప్పగా చేసి  పాలన గాడి తప్పిన సమయంలో కొత్త ప్రభుత్వానికి  సవరించుకోవడానికి, ప్రజా రంజకంగా పాలించడానికి కచ్చితంగా సమయం పడుతుంది. ఆ విషయంలో స్పష్టమైన వైఖరి  అన్ని వర్గాలకు ఉండవలసిన అవసరం ఉంది.  పాలన గాడి తప్పకుండా ప్రజల ఆకాంక్షల మేరకు సూచనలు హెచ్చరికలు చేస్తే తప్పులేదు కానీ  కొద్ది రోజులకే ప్రభుత్వం ప్రతి చర్యను కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తే మాత్రం  అది చారిత్రక తప్పిదమే అవుతుంది . ఇప్పటికీ రాష్ట్రంలో అనేక ఉద్యమ సంస్థలు  వేరువేరుగా ఏర్పడి కోర్ కమిటీలను ఏర్పరచుకొని ప్రాతినిధ్యాలను ప్రభుత్వానికి చేస్తూ  మరికొన్ని సంస్థలు హెచ్చరిస్తున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు.  తెలంగాణ  అస్తిత్వాన్ని వెతుక్కోవడానికి ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేయడం అంటే సిగ్గుపడాల్సిన విషయమేనని కూడా కొన్ని సంఘాలు వాపోతున్న సందర్భం.....  దీనికి మూలం టిఆర్ఎస్ పార్టీ యొక్క విద్రోహ పాలన అని కచ్చితంగా గుర్తించాలి,తగిన శాస్తి జరగాల్సిందే.  కెసిఆర్ కు  సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చి  ప్రజలు విభిన్న వర్గాలు అసంతృప్తికి గురై  ఆగ్రహంతో కొత్త ప్రభుత్వం కోసం ఆరాటపడి కొనితెచ్చుకున్న వేల  ఆ  ఆశించిన ఫలితాలను సాధించుకోవాలంటే కొత్త ప్రభుత్వానికి కొండంత అండగా ఉండాల్సిన అవసరం ఉంది.  మొక్కుబడి అండ  కాదు కానీ  పరిపాలన అంటే మాటలు అంకెల గారడి మాత్రం కాదు.    వివిధ రంగాల యొక్క ఆర్థిక పరిస్థితులను  బలోపేతం చేసే క్రమంలో  బడ్జెట్ ను సమున్నతంగా కేటాయించుకొని నిధులను  సమీకరించుకోవడం, ఖర్చు చేయడం,   ప్రాధాన్యతా రంగాల పైన దృష్టి సారించడం వంటి శాస్త్రీయ పద్ధతిని  కొత్త ప్రభుత్వం అలవర్చుకునే విధంగా మన ఆలోచనలు, ఒత్తిడి,  సూచనలు ఉండాలి. 
     ముందున్న సవాళ్లు :-
*****""""""
ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవడo   హేతుబద్ధంగా  బడ్జెట్ రూపకల్పన ద్వారా  ఇంతకాలం విస్మరణకు గురైన రంగాలను  బలోపేతం చేయడం కోసం  శాస్త్రీయ పద్ధతిలో జరగవలసిన ఆలోచన పరిపాలన  ప్రస్తుత ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్  .గత ప్రభుత్వం ఇచ్చి కొన్నింటిని అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చవలసిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది . గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు  సాధారణంగా ఏ ప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి  ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను  చట్టబద్ధంగా అమలు చేయవలసి ఉంటుందని ఆ మేరకు ప్రజలు తమ హక్కుగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని చేసిన సూచన  రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత వచ్చిన విప్లవాత్మక మార్పుల క్రమంలో  కూడా కొత్త ప్రభుత్వం ముందు  మరింత టార్గెట్ గా మిగిలిపోయింది  అయినప్పటికీ  ముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్గం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయా రంగాలలో  గల సమస్యలను పరిష్కరిస్తూనే వివిధ సందర్భాలలో ప్రజలతో మమేకమై ప్రజలను భాగస్వాములను చేసుకునే విధంగా  కార్యక్రమాలు రూపొందించుకోవడం అభినందనీయం .అంతేకాదు తమ శాఖల పైన  పట్టు సాధించడంతోపాటు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం అనేది  ఒక నూతమైన ఆలోచన . టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ శాఖకైనా  ముఖ్యమంత్రి మాత్రమే సమీక్షించడం నిర్ణయాలు ప్రకటించడం వంటి దురాచారం అమల్లో ఉండేది. అంతేకాదు ముఖ్యమంత్రినీ కలవడానికి  మంత్రులకు కూడా అవకాశం లేకపోవడం , ప్రజలకు  అసలే దర్శనం లేకపోవడం  ప్రజలను భాగస్వాములను చేసుకోలేదు అని చెప్పడానికి పెద్ద సాక్ష్యం.  ఒకవైపు రాష్ట్రజిల్లా స్థాయిల లో  ప్రజల సమస్యలను దరఖాస్తు రూపంలో తీసుకోవడానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు  పర్యటనలో భాగంగా మంత్రులు ఆయా ప్రాంతాలలో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా  ఏర్పాటు చేయడం కూడా అవసరం. ఆ మేరకు కొంత కృషి జరుగుతున్నట్లుగా  తెలుస్తున్నది.  టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు 60 లక్షల సైన్యం మాది అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు  కానీ  పార్టీ అధినాయకునికి కార్యకర్తలకు అనుసంధానం లేకపోవడం , కలిసి మాట్లాడే అవకాశం లేని కారణంగా  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడవలసి వచ్చిందని క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకులు తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే . పార్టీని కార్యకర్తలను విస్మరించిన ఆనాటి ప్రభుత్వం ప్రజలను కూడా అదే మాదిరిగా విస్మరించిన కారణంగా  అధికారం పైన ఉన్నటువంటి సోయి పాలన పైన లేకపోవడం, హామీలు వాగ్దానాలపైన దృష్టి సారించకపోవడం, ప్రజా ఆస్తులను కొల్లగొట్టడం,  శాసనసభ్యుల భూ ఖబ్జాల కారణoగా  గత ప్రభుత్వం ప్రజలలో   అపహాస్యం పాలైనది. కానీ ఆ వైఫల్యాలు ప్రస్తుత ప్రభుత్వం మీద  పరోక్షంగా ఒత్తిడికి కారణమైన విషయాన్ని కూడా సమాజం గమనించాలి . సాధ్యమైనంతవరకు ఉచితాలు వాగ్దానాలను  తగ్గించుకోవడంతోపాటు  ఆర్థిక అంతరాలను  నిర్మూలించే క్రమంలో పేద వర్గాలకు మాత్రమే ఎక్కువ ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది . అదే సందర్భంలో విద్యా వైద్యం  పేద వర్గాలకు అందకపోగా ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటూ అప్పుల పాలవుతున్న విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా గమనించి  ముఖ్యంగా పట్టణాలలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా  వారి కొనుగోలు శక్తిని తగ్గకుండా చూడాలి.  అదే సందర్భంలో  అల్పాదాయ వర్గాలు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వమే  ఆ ఆర్థిక భారాన్ని  మోయవలసిన అవసరం కూడా గుర్తించాలి. అప్పుడే  పేద వర్గాలకు చెందిన వేలాది కుటుంబాలు తమకు ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనం జరిగింది అని  సంతృప్తి చెందుతారు . ఇప్పటికే  అనేక వర్గాలు, మార్గాల ద్వారా ప్రభుత్వానికి అందిన సూచనలను పరిగణనలోకి తీసుకొని  సంపదను సృష్టించడం ద్వారా ఆ ప్రజా సంపదను ప్రజలందరికీ పంపిణీ చేసే వినూత్న పద్ధతిలో పాలన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యాన్ని పెద్ద మొత్తంలో  పొందడం, ప్రజామోదం ద్వారా తమ పరిపాలనను విస్తృతం శాశ్వతం చేసుకోవడం ప్రస్తుత ప్రభుత్వముందున్నటువంటి  ప్రధాన కర్తవ్యాలుగా గుర్తించాలి . సూచనలు సలహాలు అభిప్రాయాలను గౌరవిస్తూనే  బెదిరింపులు  హెచ్చరికలు  ఘర్షణకు పాల్పడే వారిని  ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని  ఆమడ దూరం తరం వలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. దానికి మన చేతిలో ఉన్న ప్రత్యామ్నాయం పార్లమెంటు ఎన్నికల్లో  మరింతగా  లేవకుండా ఓటమిపాలు చేయడమే.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333