ఘనంగా దుర్గా పూజ వేడుకలు
కోల్కతా లోని బర్ధమన్ జిల్లా కేంద్రాంలో దుర్గా పూజ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా Mukta Aboho ఛానల్ సీఈఓ నసీముద్దీన్ మాట్లాడుతూ కోల్కతా దుర్గాపూజ వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అన్నారు.అదే విధంగా ఆధునిక కళ, సాంస్కృతిక అంశాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు మరియు దసరా సమయంలో కోల్కతాలో పండుగ వాతావరణం నెలకొంటుందని వారు అభిప్రాయపడ్డారు.పెద్ద పెద్ద మండపాలలో దుర్గామాత విగ్రహాలతో అలంకరించిన నిర్వాహకులను "Mukta Aboho Tv" ఛానల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు మండపాలను సందర్శించి వారికి మెమెంటో మరియు సర్టిఫికెట్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఛానల్ సీఈఓ నసీముద్దీన్, సీనియర్ కరెస్పాండంట్ సర్మిస్ట్ పండా, జాయింట్ డైరెక్టర్లు సయ్యద్ ఇమ్రాన్, నూర్ ఆలం, అకాష్ దత్త పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.