గురుకుల పాఠశాలకు నూతనంగా ప్రిన్సిపాల్ గా ఝాన్సీ.. మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి సంఘ నాయకులు

అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు నూతనంగా ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన ఝాన్సీ.. మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ..పాఠశాలలో స్థానికంగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని జిల్లాలోని అన్ని పాఠశాలల కంటే అడ్డగూడూరు పాఠశాల ముందు ముందంజలో ఉండాలని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ,ఐ,ఎస్,ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిప్పలపల్లి వంశీ, కుమార్,తరుణ్,తరాల సాయికుమార్, యస్,ఎస్,యు జిల్లా నాయకులు చెరుకు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.