ఇసుక ర్యాంపు ఏర్పాటు గృహ యజమానులకు ఊరట

Mar 8, 2024 - 19:07
 0  5

సుదీర్ఘకాలం తర్వాత "మన ఇసుక-మన వాహనం" అందుబాటులోకి తెస్తున్నాం
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
చాటివారిగూడెం ఇసుక ర్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే 

లక్ష్మీదేవిపల్లి : సుదీర్ఘకాలం తర్వాత కొత్తగూడెం కేంద్రంలో ఇసుక ర్యాంపు ప్రారంభించుకోవడంవల్ల గృహ యజమానులకు ఊరట లభిస్తుందని, ప్రభుత్వ అభివృద్ధిపనులు సైతం వేగవంతంగా జరుగుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ పరిధిలోని చాటివారిగూడెంలో "మన ఇసుక-మన వాహనం"పేరుతో ఏర్పాటుచేసిన ఇసుక ర్యాంపును గురువారం అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలకు ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల నియోజకవర్గ కేంద్రంతోపాటు పరిసర గ్రామాల గృహ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడటాన్ని గుర్తించి ఇసుక ర్యాంపు ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు. స్థానికంగా ఇసుక కొనుగోలు చేసే వెసులుబాటుతో ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. గృహ యజమానులకే కాకుండా పరోక్షంగా వేలాది మంది భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి మెరుగుపడుతుందని తెలిపారు. మరిన్ని ర్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటుచేసిన ర్యాంపును సద్వినియోగ చేసుకోవాలని సూచించారు. ర్యాంపు ప్రారంభ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మండల తహసిల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో చలపతిరావు , పంచాయతిరాజ్ ఏఈ రామకృష్ణ, ఎంపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శివాని, ఎస్ ఆర్ వో రాము, ఎంపీపీ సోనా, ఎంపిటిసి గోవింద్  పి ఎస్ సి ఎస్ చైర్మన్ కూచిపూడి జగన్నాథం,  స్థానికులు భూక్యా దస్రు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కిలారు ప్రసాద్,  మురళి, తాళ్ల వెంకటేశ్వర్ రావు, పూనేం శ్రీనివాస్, మిర్యాల రాము, ఎండి గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333