తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం పాత కమిటీని రద్దుచేసి నూతనంగా ఎన్నికలు పెట్టాలి

సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు బోయినపల్లి రామారావు గౌడ్ 

Feb 29, 2024 - 20:52
 0  4
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం పాత కమిటీని రద్దుచేసి నూతనంగా ఎన్నికలు పెట్టాలి

ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు బోయినపల్లి రామారావు గౌడ్ మాట్లాడుతూ యం.డి.అబ్దుల్ హకీం తన ఉద్యోగ బాధ్యతల నుండి సస్పెండు అయినా కూడా సంఘ సభ్యులకు తెలియకుండా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులుగా కొనసాగినారని ప్రధాన కార్యదర్శి అయిన డి. వేణుగోపాల్ ను తనకు తానుగా రాజీనామా చేసే విధముగా ఒత్తిడి చేసి జిల్లా కార్యవర్గ సభ్యులకు తెలియకుండా తనకు అనుకూలమైన వ్యక్తి అయిన టి.పంతులు ను ప్రధాన కార్యదర్శిగా నియమించారని , జిల్లా ప్రధాన కార్యదర్శిగా టి, పంతులు నియమించటంలో అబ్దుల్ హకీం తప్పు చేసారని ప్రశ్నించిన కారణంగా బి. రామారావు ను అసోసియేట్ అధ్యక్షులను పదవి నుండి మరియు సాధారణ సభ్యత్వం నుండి తొలగించారని , ప్రశ్నించిన ప్రతి కార్యవర్గ సభ్యులను తొలగిస్తూ వారి స్థానములలో క్రొత్త వారిని నియమించటం సంఘ బైఆలకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు . దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘములోని ముఖ్య సభ్యులను అనధికారికముగా తొలగించి క్రొత్త వారిని ఏకపక్షముగా నియమించుట మరియు సంఘ సభ్యులు కాని వారిని సంఘ భవనములోనికి అనుమతించి సంఘ సభ్యులకు స్వేచ్ఛ లేకుండా చేయుట మరియు సంఘము యొక్క ధనమును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు . యం.డి.అబ్దుల్ హకీం చేసే సంఘ వ్యతిరేక కార్యక్రమాలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో సమావేశములు అనగా ది: 18-02-2024న కొత్తగూడెం మరియు భద్రాచలంలో మరియు ది 25-02-2024న ఖమ్మం డివిజన్లలో మీటింగులు పెట్టి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న యం.డి. అబ్దుల్ హకీం ను సంఘం నుండి తొలగించుటకు అవిశ్వాస తీర్మానములు పెట్టి (జనరల్ బాడీ) సాధారన సభ్యుల యొక్క అభిప్రాయములతో కూడిన సంతకాలు సేకరించి రాష్ట్ర సంఘ అధ్యక్షుల వారికి సమర్పించి ప్రస్తుతము ఉన్న జిల్లా అధ్యక్షులను తొలగించి అతి త్వరలో జిల్లా సంఘమునకు బైలాను అనుసరించి ఎన్నికలు జరిపించేందుకు తీర్మానాలు చేయడమైనదని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు విజీకే మూర్తి , గౌరవ అధ్యక్షు కే వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు గడ్డం రాములు , ప్రధాన కార్యదర్శి దాసరి వేణుగోపాల్ , కోశాధికారి ఎస్పీ ప్రసాద్ , టౌన్ ప్రెసిడెంట్ ఎల్ గంగన్న లు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333