గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి :- గ్రామపంచాయతీ వర్కర్స్ &యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు ఆత్మకూర్ (S)మండల కేంద్రం లోని MPDO కార్యాలయం లో MPDO గారిని మర్యాదపూర్వకంగా కలసి మెమోరాండం ఇచ్చిన వెంటనే MPDO గారు సానుకూలంగా స్పందించారు అనంతరం విలేకరుల సమావేశం లో గ్రామపంచాయతీ వర్కర్స్ &యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు మాట్లాడుతూ నెలలు గడుస్తున్న జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దసరా పండుగకు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షురాలు నాగమ్మ, మండల నాయకులు మాతంగి నాగయ్య, మురగుండ్ల వెంకన్న, ఎడ్ల జలేందర్, పూలమ్మ, షపి తదితరులు పాల్గొన్నారు