ఓల్డ్ ఏజ్ కిట్ పంపిణీ ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 25 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రాచకొండ కమీషనరేట్ అనుసంధాన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాచకొండ సీపీ జి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.గోల్డెన్ కేర్ అనే కార్యక్రమంలో భాగంగా కేర్ ఫర్ డోస్ ఊ కేర్డ్ అస్ అనే టాగ్ లైన్ తో గురువారం రోజు మండల పరిధిలో ఉన్న కొని గ్రామాలలో పేదవారైనా సీనియర్ సిటిజన్స్ కు ఓల్డ్ ఏజ్ కిట్స్ అందించడం జరిగిందని అన్నారు.ఇట్టి కిట్ లో అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు,అలాగే పోషకాహార తిను బండారాలు ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరెడ్డి,ఏఎస్ఐ ఈశ్వర్ పోలీస్ సిబ్బంది. వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.